Home న్యూస్ అడివి శేష్ డెకాయిట్ గ్లిమ్స్ రివ్యూ….కుమ్మిందిగా!!

అడివి శేష్ డెకాయిట్ గ్లిమ్స్ రివ్యూ….కుమ్మిందిగా!!

0

ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ తో ఎప్పటి కప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకునే యంగ్ హీరో అడివి శేష్(Adivi Sesh) నటించిన కొత్త సినిమా డెకాయిట్(Dacoit Movie) ఇప్పుడు గూడచారి2 కన్నా ముందు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా రిలీజ్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ గ్లిమ్స్ ను…

రిలీజ్ చేసి డేట్ ని ఫైనల్ చేశారు మేకర్స్….సినిమా ఈ ఇయర్ డిసెంబర్ 25న క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా కన్ఫాం చేయగా…గ్లిమ్స్ బాగానే మెప్పించింది అని చెప్పాలి. అడివి శేష్ వాయిస్ ఓవర్ తో సాగిన గ్లిమ్స్ లో…

అడివి శేష్ హీరోయిన్ మృణాల్ గురించి మాట్లాడుతూ…నీకు జరిగింది మామూలుది కాదు…అందరూ నిన్ను మోసం చేశారు…కానీ నేను మోసం చేయడానికి రాలేదు…కుడిపించడానికి వచ్చాను అంటూ డిఫెరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ పాయింట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు…

సినిమాలో ఇటు హీరో అటు హీరోయిన్ ఇద్దరూ డెకాయిట్స్ గా కనిపిస్తూ ఉండగా ఒకరిని ఒకరు మోసం చేసుకునే క్రమంలో జరిగిన ఇన్సిడెంట్స్ నేపధ్యంలో సినిమా సాగబోతుంది… ఇక గ్లిమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా..

రిచ్ గానే ఉన్నాయి గ్లిమ్స్ వరకు…ఇది వరకు శృతి హాసన్ ని హీరోయిన్ గా అనుకోగా తర్వాత మృణాల్ తో హీరోయిన్ రోల్ ని రీప్లేస్ చేశారు. ఓవరాల్ గా గ్లిమ్స్ సినిమా మీద డీసెంట్ లెవల్ లో అంచనాలను పెంచింది అని చెప్పలి. ఇక ఈ సినిమాతో అడివి శేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here