దేవ్ ప్రీమియర్ షో రివ్యూ! హిట్టా..ఫ్లాఫా??

0
508

 తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలలో కార్తి ఒకరు, రీసెంట్ టైం లో ఖాకీ, చినబాబు అంటూ రెండు బాక్ టు బాక్ మంచి విజయాలను సొంతం చేసుకున్న కార్తి నటించిన లేటెస్ట్ మూవీ దేవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, కాగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి వినిపిస్తున్న మొదటి టాక్ ఎలా ఉందొ తెలుసుందాం పదండి…

లైఫ్ లో అడ్వెంచర్ ని ఎక్కువగా ఇష్టపడే హీరో అనుకోకుండా యంగ్ బిజినెస్ వుమన్ అయిన రకుల్ ని మీట్ అవుతాడు, తర్వాత అతని లైఫ్ లో జరిగిన మార్పులు ఎలాంటివి  అన్నది స్టొరీ పాయింట్ అంటున్నారు, కథ పాయింట్ లో బలం లేకున్నా…

సీన్ సీన్ గా మాత్రం ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు, ఫస్టాఫ్ వరకు అలరించే సన్నివేశాలు, మంచి మ్యూజిక్, రిచ్ లోకేషన్స్ తో సరదా సరదా గా సాగగా మంచి పాయింట్ తో ఇంటర్వెల్ అవుతుందని, సెకెండ్ ఆఫ్ మొత్తం ఆ పాయింట్ పైనే అసలు కథ నడుస్తుంది అని అంటున్నారు.

Karthi "Dev" Pre Release Business...Box office Target

కానీ అది కొంచం స్లో గాను, బోర్ కొట్టే విధంగాను ఉంటుందని అంటున్నారు, కార్తీ మరోసారి నటనతో ఆకట్టుకోగా రకుల్ ఈ మధ్యకాలంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది అంటున్నారు, ఇక మిగిలిన పాత్రలు తమ పరిదిలో ఆకట్టుకున్నాయని అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా మరీ అద్బుతం కాకున్నా ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉందని, ఫైనల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ గా అనిపించిందని అంటున్నారు. ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!