Home న్యూస్ దేవర 1st సాంగ్…..బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!

దేవర 1st సాంగ్…..బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!

0

సమ్మర్ లో అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే రిలీజ్ అయ్యి ఉండాల్సిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) కొరటాల శివ(Koratal Siva) ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) సినిమా ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇప్పుడు…

ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి మొదటి సాంగ్ (Devara First Single ) Fear Song ను రిలీజ్ చేయబోతున్నారు. మే 19న సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుండగా టాలీవుడ్ లో ఈ సాంగ్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి అని చెప్పాలి. ముందుగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో ప్రస్తుతం….

సర్కారు వారి పాట(Sarkaru vaari paata) సినిమాలోని కళావతి(Kalaavathi) సాంగ్ 9 నిమిషాల్లో రికార్డ్ ను అందుకుంది. ఇక టాలీవుడ్ తరుపున 24 గంటల్లో వ్యూస్ పరంగా గుంటూరు కారం(Guntur Kaaram)లోని ధమ్ మసాలా(Dum Masala Song)సాంగ్ 17.42 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ ను అందుకోగా లైక్స్ పరంగా సర్కారు వారు పాట లోని కళావతి సాంగ్  806.3K లైక్స్ తో రికార్డ్ హోల్డర్ గా ఉంది…

ఇక ఓవరాల్ గా సౌత్ మూవీస్ పరంగా చూసుకుంటే దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన గోట్(G.O.A.T Movie) మూవీ లోని విజిల్ పోడు(Whistle Podu Song)సాంగ్ 24.88 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ హోల్డర్ గా ఉండగా లైక్స్ పరంగా విజయ్ బీస్ట్(Beast Movie) మూవీ లోని అరబిక్ కుత్తు(Arabic Kuthu Song)సాంగ్ 2.2 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది….

ఈ రికార్డులను దేవర ఫస్ట్ సాంగ్ అయిన ఫియర్ సాంగ్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది…పాన్ ఇండియా రేంజ్ లో మంచి హైప్, ఎన్టీఆర్ అనిరుద్ ల క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సాంగ్ ఎన్టీఆర్ బర్త్ డే టైంలో రిలీజ్ కానుండటంతో రికార్డులు క్రియేట్ చేయడానికి అవకాశం ఎంతైనా ఉంది. మరి అంచనాలను సాంగ్ అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here