Home న్యూస్ దేవర 1st డే 150 కొట్టాలంటే…ఇది జరిగి తీరాల్సిందే!!

దేవర 1st డే 150 కొట్టాలంటే…ఇది జరిగి తీరాల్సిందే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ అయిన దేవర(Devara Part 1) ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద మంచి అంచనాలు ఉండగా, ఓపెనింగ్స్ నుండి రికార్డులను ఈ సినిమా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని…

అందరూ అంచనా వేస్తూ ఉండగా మొదటి రోజు ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రిడిక్ట్ చేయడం మొదలు పెట్టారు…కాగా అందరూ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 130-150 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోవడం…

ఖాయమని అంచనాలు వేస్తున్నారు….కానీ ఇదంతా జరగాలి అంటే సినిమా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాత్రమే కుమ్మేస్తే సరిపోదు, హిందీ, తమిళ్, కర్ణాటక, కేరళ ఇలా మిగిలిన చోట్ల కూడా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంటేనే ఎంతో కొంత సాధ్యం అని చెప్పాలి…

ఇదంతా జరగాలి అంటే సినిమా అఫీషియల్ ట్రైలర్ అంచనాలను మించి క్లిక్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది…ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ అలాగే ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా మేకర్స్ ట్రైలర్ ను కట్ చేస్తే…ఆ ట్రైలర్ తెలుగు తో పాటు ఇతర భాషల్లో…

అనుకున్న రేంజ్ లో క్లిక్ అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు 70-75 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను, హిందీలో 15-18 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 15-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇక ఓవర్సీస్ లో 35-40 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ ను కనుక అందుకుంటే సినిమా మొదటి రోజు 150 కోట్ల మార్క్ ని టచ్ చేయోచ్చు, కానీ ఇది జరగాలి అంటే ట్రైలర్ ఓ రేంజ్ లో క్లిక్ అవ్వడంతో పాటు సినిమాకి యునానిమస్ రెస్పాన్స్ కూడా సొంతం అవ్వడం ఎంతైనా అవసరం, ఇవన్నీ జరిగితేనే సినిమా మొదటి రోజు 150 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here