రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా….కంటిన్యూగా 19 రోజులు నాన్ స్టాప్ కోటికి తగ్గకుండా షేర్ ని సాధించిన ఈ సినిమా…తర్వాత వర్కింగ్ డేస్ లో సైతం…
లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 4వ వారంలో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో మరోసారి స్ట్రాంగ్ వీకెండ్ కి సిద్ధం అవుతూ ఉంది ఇప్పుడు. మొత్తం మీద సినిమా…
22వ రోజులో ఆల్ మోస్ట్ 21వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు బాగానే జోరు చూపిస్తూ ఉండటంతో 22వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు…. మరోసారి 60 లక్షల షేర్ ని దాటేసి 65 లక్షల రేంజ్ లో…
కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు కనుక బాగుంటే ఇకొంచం ఎక్కువ షేర్ ని అందుకోవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం సినిమా ఓవరాల్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా స్క్రీన్ కౌంట్ కూడా తగ్గింది. ఇక ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా 22వ రోజున ఇప్పుడు 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది..ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా బాక్స్ అఫీస్ దగ్గర 22 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.