Home న్యూస్ 24 గంటలు ఓవర్….దేవర 2nd ట్రైలర్ కి ఊహకందని రెస్పాన్స్!

24 గంటలు ఓవర్….దేవర 2nd ట్రైలర్ కి ఊహకందని రెస్పాన్స్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1 Movie) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా నుండి వచ్చిన పాటలు ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

ట్రైలర్ 1 రిలీజ్ అయిన రోజున కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను యూట్యూబ్ లో గ్లిట్చ్ వలన అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను అందుకోలేక పోయింది కానీ తర్వాత లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ రీచ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా నుండి రీసెంట్ గా రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు…మొదటి ట్రైలర్ కన్నా కూడా రెండో ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది ఈ సినిమా ట్రైలర్…ట్రైలర్ లో కంటెంట్ అండ్ అనిరుద్ మైండ్ బ్లోయింగ్…

Devara Part 1 Pre Release Business Details!!

బ్యాగ్రౌండ్ స్కోర్ రెండో ట్రైలర్ కి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ హీరోయిజం సీన్స్ బాగా మెప్పించాయి…ఇక యూట్యూబ్ లో రెండో ట్రైలర్ కి ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు…

ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి రెండో ట్రైలర్ కి 16.20 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 346K లైక్స్ సొంతం అయ్యాయి. లైక్స్ పర్వాలేదు అనిపించగా వ్యూస్ పరంగా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను దేవర రెండో ట్రైలర్ సొంతం చేసుకుంది.

మొత్తం మీద రెండు ట్రైలర్స్ లో సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్నది ఆడియన్స్ కి చాలా వరకు అర్ధం అయినా కూడా ఆడియన్స్ ఊహించని ట్విస్ట్ లు ఉన్నాయి అంటూ హైప్ ఇంకా పెంచుతున్నారు… ఇక సినిమా ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకుని మాస్ రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here