Home గాసిప్స్ దేవర …2 మేజర్ ట్విస్ట్ లు…ఏది నిజం అయినా భీభత్సమే!

దేవర …2 మేజర్ ట్విస్ట్ లు…ఏది నిజం అయినా భీభత్సమే!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో ఈ నెలలో రిలీజ్ కాబోతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద హైప్ సూపర్ సాలిడ్ గా ఉంది, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఇనీషియల్ గా మిక్సుడ్ గా ఉన్నా కూడా..

రోజు రోజుకి అది పాజిటివ్ గా మారుతూ సినిమా మీద మరింతగా అంచనాలను అయితే పెంచేస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా ట్రైలర్ చూసిన తర్వాత రొటీన్ కథగానే అనిపిస్తున్నా కూడా ఏకంగా ఎన్టీఆర్ సైతం సినిమాలో చివరి 40 నిమిషాల ఎపిసోడ్ ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ..

చెప్పడంతో ఎవరికి వారు సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ ఎవరి థియరీ వాళ్ళు రాసుకుంటున్నారు, కానీ సోషల్ మీడియాలో 2 థియరీలు మాత్రం ఎక్కువగా అలరించేలా ఉన్నాయి, మరి వాటిలో ఏవి నిజం అవుతాయో అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

మొదటి థియరీ ప్రకారం పెద్ద దేవర సముద్రంలో అజ్ఞాతంలో ఉంటూ సముద్రంలో తప్పు చేయాలి అనుకున్న వాళ్ళని చంపుతూ ఉంటాడు, కానీ అలా చంపేది మాత్రం ఎప్పుడూ భయపడుతూ ఉండే చిన్న దేవర అని క్లైమాక్స్ లో తెలుస్తుంది, కానీ పెద్ద దేవరని చంపింది ఎవరు అనేది మాత్రం పార్ట్ 2 లో చూపెడతారు…

అనేది మొదటి థియరీ అయితే రెండో థియరీ మాత్రం ఇంకొంచం ఎక్సైట్ గా ఉంది….ట్రైలర్ లో వాడికి తండ్రి పోలిక వచ్చింది కానీ రక్తం రాలేదు అంటూ డైలాగ్ పెట్టి ఫోకస్ తండ్రి కొడుకు మీద పెట్టారు కానీ, అసలు మ్యాటర్, పెద్ద దేవర కి ఇద్దరు కొడుకులు ఉంటారు, అందులో పెద్దోడు ధైర్యవంతుడు అయితే…

చిన్నోడు పిరికివాడు…కానీ పెద్ద కొడుకు సముద్రంలోకి వెళ్లి 2 ఏళ్ళు అయిన తర్వాత చిన్నకొడుకు వెతకడానికి వెళతాడు, అప్పుడు చిన్నకొడుకు మీద శత్రువులు అటాక్ చేస్తే ఎవ్వరూ ఊహించని విధంగా వీళ్ళ తండ్రి అయిన పెద్ద దేవర వచ్చి వీళ్ళని కాపాడతాడు అనేది మరో థియరీ…

ఈ పాయింట్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా ఉందని చెప్పాలి, అందరూ డ్యూయల్ యాక్షన్ అనుకుంటూ ఉన్న టైంలో ఏకంగా ట్రిపుల్ రోల్ ఉందని తెలిస్తే ఆ రచ్చ మరో రేంజ్ లో ఉంటుంది….ఇవన్నీ థియరీలు మాత్రమే కథ ఈ విధంగానే ఉంటుందా లేక మరేమైనా మేజర్ ట్విస్ట్ లు ఉంటాయా అన్నది సినిమా వచ్చాకే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here