బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో మాస్ రచ్చ చేయగా….6 ఏళ్ల గ్యాప్ లో సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి వచ్చిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతుంది…
కాగా ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది సినిమా…టెంపర్ ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ లో ఎన్టీఆర్, టెంపర్ నుండి ఒక్క పరాజయం లేకుండా దూసుకు పోతున్న ఎన్టీఆర్ ఫ్లాఫ్స్ లేకుండా రచ్చ చేసినప్పటికీ కూడా…
భారీ హిట్ ను భారీ లాభాలను మాత్రం అందుకోలేదు, టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలు జస్ట్ హిట్ అవ్వగా జానతా గ్యారేజ్ సూపర్ హిట్ టు బ్లాక్ బస్టర్ గా నిలిచింది….తర్వాత జై లవ కుశ ఎబో యావరేజ్ గా నిలిచింది, అరవింద సమేత హిట్ అయింది…
తర్వాత రామ్ చరణ్ తో చేసిన ఆర్ ఆర్ ఆర్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఇప్పుడు సోలో హీరోగా చేసిన దేవర ఇప్పుడు బిజినెస్ ఆల్ మోస్ట్ 10 రోజుల్లో ఏకంగా 36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్ లో భారీ లాభాలతో…
ఫస్ట్ టైం మాస్ రచ్చ చేసింది, కెరీర్ మొదట్లో, ఆది సింహాద్రి సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రేంజ్ లో లాభాలను అందుకోవడం అది కూడా మిక్సుడ్ టాక్ తో ఈ రేంజ్ లో లాభాలను అందుకోవడం, ఇంకా దసరా సెలవులు ఉండటంతో లాంగ్ రన్ లో…
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు, రాజమౌళి హీరోల నెక్స్ట్ మూవీస్ రిజల్ట్ ఫ్లాఫ్ అవుతూ ఉండటంతో ఆ మిత్ ని బ్రేక్ చేసి ఈ రేంజ్ లో లాభాలతో దుమ్ము లేపిన దేవర లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇక…