టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ మంచి హోల్డ్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా…
సినిమా 5వ రోజు వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని చూపించిన తర్వాత 6వ రోజు సినిమాకి వర్కింగ్ డేస్ లో బిగ్ అడ్వాంటేజ్ ను ఇస్తూ అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడే అడ్వాంటేజ్ ను ఇస్తుంది….నేషనల్ హాలిడే అవ్వడంతో సినిమా ఈ రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరుని…
చూపిస్తూ ఇప్పుడు భీభత్సం సృష్టించడానికి సిద్ధం అవుతూ ఉంది. సినిమా ముఖ్యంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో, హిందీలో మరియు కర్ణాటకలో ఎక్స్ లెంట్ గా రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆల్ రెడీ మార్నింగ్ షోల టికెట్ సేల్స్ లో…
సాలిడ్ గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఇదే ట్రెండ్ మ్యాట్నీ అండ్ ఈవినింగ్ షోల పాటు ఎక్స్ లెంట్ గా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో మంచి లాభాల దిశగా పరుగును కొనసాగించే అవకాశం ఉంది.
ఆల్ రెడీ సినిమా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండటంతో, ఈ రోజు మాస్ గ్రోత్ ని చూపించిన తర్వాత వీకెండ్ లో తిరిగి సినిమా రచ్చ చేసే అవకాశం ఉంది, తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ తో సినిమా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…ఇక ఈ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.