ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నుండి వస్తున్న సోలో మూవీ అయిన దేవర(Devara Part 1) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సినిమా…
ఓవరాల్ గా బిజినెస్ పరంగా కూడా రచ్చ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బిజినెస్ డీల్ కంప్లీట్ అయిపొయింది. నైజాంలో ఆల్ రెడీ 44 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా సీడెడ్ లో ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా…
కోస్టల్ ఆంధ్ర రీజన్ లో కూడా ఓవరాల్ గా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది, ఆంధ్రప్రదేశ్ లో సినిమాకి స్పెషల్ టికెట్ హైక్స్ అలాగే స్పెషల్ షోల అడ్వాంటేజ్ కూడా ఉండటంతో సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద దేవర మూవీ…
తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#Devara Telugu States Pre Release Business Details(Valued)
👉Nizam: 44Cr
👉Ceeded: 22Cr
👉UA: 12.40Cr
👉East: 7.75Cr
👉West: 6.50Cr
👉Guntur: 8.50Cr
👉Krishna: 7.20Cr
👉Nellore: 4.20Cr
AP-TG Total:- 112.55CR
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఓవరాల్ గా 114 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా మీద ఉన్న హైప్ కి సోలో బిగ్ రిలీజ్ దృశ్యా టాక్ బాగుంటే ఎక్స్ లెంట్ గా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.