Home న్యూస్ టికెట్ ముక్క లేదు….ఎన్టీఆర్ మాస్ రచ్చ మొదలు!!

టికెట్ ముక్క లేదు….ఎన్టీఆర్ మాస్ రచ్చ మొదలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ అయిన దేవర(Devara Movie) మీద అంచనాలు అందరిలోనూ ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా టాక్ ఏమాత్రం బాగున్నా కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో…

అన్ని చోట్లా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా, ఆల్ రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ తో ఊహకందని రేంజ్ లో రాంపెజ్ ను చూపెడుతూ ఎన్టీఆర్ మాస్ పవర్ ను చూపిస్తూ ఉండగా మరో పక్క బిజినెస్ పరంగా కూడా దుమ్ము లేపుతున్న ఈ సినిమా..

అన్ని చోట్లా మంచి బిజినెస్ ను అందుకుంది, బిగ్ సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ కాబోతున్న దేవర మూవీ కి ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ కి ముందు రోజు నుండే మిడ్ నైట్ షోలతో రిలీజ్ కాబోతూ ఉండగా కొన్ని చోట్ల టికెట్ బుకింగ్స్ ను ఆఫ్ లైన్ లో ఓపెన్ చేయగా…

ఓపెన్ చేసిన చోట బుకింగ్స్ అన్నీ కూడా ఆల్ మోస్ట్ అన్ని టికెట్స్ సోల్డ్ ఔట్ అయిపోయాయి…సీడెడ్ లో అయితే ఓపెన్ చేసిన సెంటర్స్ లో టికెట్ ముక్క కూడా లేదు బెనిఫిట్ షోలకు….ఈ రేంజ్ లో రచ్చ చేస్తున్న దేవర మూవీ రీసెంట్ టైంలో ఏ సినిమా కూడా…

ఆంద్ర సీడెడ్ లో చూపించని రేంజ్ లో రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఆ రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ మిడ్ నైట్ షోలకు ఉండగా టోటల్ బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ కాబోతున్నాయి. ఇక సినిమా మీద బజ్…

సాలిడ్ గా ఉండటం, రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేయడంతో ఇక జస్ట్ టాక్ ఒక్కటి వస్తే అన్ని చోట్లా ఎన్టీఆర్ మాస్ ఓపెనింగ్స్ తో తన స్టార్ పవర్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here