మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోలు ఎక్కువ మంది…ఒకప్పుడు ఏడాది గ్యాప్ లో అందరు హీరోల సినిమాలు క్రమం తప్పకుండా రిలీజ్ అవుతూ ఉండేవి కానీ…పాన్ ఇండియా మార్కెట్ వలన టాప్ స్టార్స్ నటించిన సినిమాలు చాలా రేర్ గానే రిలీజ్ అవుతూ వస్తున్నాయి…దాంతో తమ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడే ఫ్యాన్స్ పండగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు…
లాస్ట్ ఏడాది కాలంగా చూసుకుంటే ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ 4 టాప్ స్టార్స్ మూవీస్ రిలీజ్ అవ్వగా ఈ ఇయర్ సంక్రాంతి కి మరో టాప్ స్టార్ మూవీ రిలీజ్ అయింది…ఏడాది గ్యాప్ లో వచ్చిన అన్ని సినిమాలను చూసుకుంటే రిలీజ్ అయిన రోజు ఒక పండగ లా ఫ్యాన్స్ హంగామా….థియేటర్స్ లో ఫుల్ సెలబ్రేషన్స్ లాంటివి..
అందరికీ జరిగినప్పటికీ కూడా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా టైంలో యుఫోరియా మాత్రం మరో లెవల్ అనే చెప్పాలి…ఆల్ మోస్ట్ 6 ఏళ్ల ఎన్టీఆర్ నుండి వచ్చిన సోలో మూవీ అవ్వడంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సినిమాను సెలెబ్రేట్ చేసుకున్నారు….ఆ సినిమా ఎక్స్ ట్రీమ్ మిక్సుడ్ టాక్ తెచ్చుకున్నా…
ఫ్యాన్స్ సినిమా ను హిట్ గీత దాటించి బ్లాక్ బస్టర్ కొట్టారు….ఇక ఏడాదిలో రిలీజ్ అయిన గుంటూరు కారం టైంలో కూడా మహేష్ ఫ్యాన్స్ బాగానే సెలబ్రేట్ చేసుకోగా కల్కి టైం లో అప్పుడే ఎలక్షన్స్ లాంటివి అవ్వడంతో ఫ్యాన్స్ మరీ భారీగా సెలెబ్రేట్ చేయలేదు కానీ పర్వాలేదు అనిపించేలా జోరు చూపించారు…
ఇక ఇయర్ ఎండ్ లో పుష్ప2 కి కూడా మంచి సెలబ్రేషన్ లు జరిగాయి…తెలుగు రేంజ్ లో హిందీ లో కూడా సినిమా కి సాలిడ్ సెలెబ్రేషన్ లు జరగడం విశేషం. ఇక లేటెస్ట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతి లాంటి బిగ్ ఫెస్టివల్ టైం లో రిలీజ్ అయినా కూడా మరీ అనుకున్న రేంజ్ లో సెలెబ్రేషన్ లు అయితే…
జరగలేదు అనే చెప్పాలి. సోలో హీరోగా రామ్ చరణ్ నుండి కూడా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల గ్యాప్ లో వచ్చిన సినిమాకి రిలీజ్ రోజున ఉండాల్సిన హంగామా ఏమి పెద్దగా కనిపించలేదు…..దాంతో లాస్ట్ ఏడాది గ్యాప్ లోనే కాకుండా రీసెంట్ టైంలో ఫ్యాన్స్ ఒక సినిమాను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకునే విషయంలో దేవర టాప్ లో నిలిచింది అని చెప్పాలి.