Home న్యూస్ దేవర దావూదీ సాంగ్ రివ్యూ…ఎన్టీఆర్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం!

దేవర దావూదీ సాంగ్ రివ్యూ…ఎన్టీఆర్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం ఖాయం!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సోలో హీరోగా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) ఆడియన్స్ ముందుకు ఈ నెల లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద అంచనాలు మరో లెవల్ లో ఉండగా సినిమా నుండి ఇంకా ట్రైలర్ అలాగే మిగిలిన సాంగ్స్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా….

అవన్నీ ఒక్కోటిగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోవడం ఖాయమని చెప్పాలి. ఇక లేటెస్ట్ సినిమా నుండి ఫస్ట్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు సినిమా నుండి 2 లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వగా…

ఆ రెండూ కూడా సాలిడ్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు సినిమా నుండి దావూదీ(Daavudi – దావూదీ Video Song) సాంగ్ ను రిలీజ్ చేయగా సాంగ్ మొత్తం మీద ఫస్ట్ టైం విన్నప్పుడు పర్వాలేదు అనిపించేలా ఉండగా విజువల్స్ పరంగా మాత్రం గ్రాండియర్ లెవల్స్…

విజువల్స్ కానీ ఎక్స్ లెంట్ గా మెప్పించాయి…ఇక ఎన్టీఆర్-జాన్వి కపూర్ ల కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది అని చెప్పాలి, ఒక సాంగ్ ఆడియో పరంగా పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ మాత్రం ఎక్స్ లెంట్ గా ఉన్నాయి అని చెప్పాలి…

ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఫుల్ డాన్స్ కి స్కోప్ ఉన్న సాంగ్ లో ఫ్యాన్స్ కోరుకునే స్టెప్స్ తో మెప్పించాడు ఎన్టీఆర్, స్టెప్స్ కూడా బాగానే ఉండటంతో థియేటర్స్ లో ఈ స్టెప్స్ ఇక ఫ్యాన్స్ విజిల్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా మీద అంచనాలను ఈ సాంగ్ పెంచేసింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here