Home న్యూస్ ఎన్టీఆర్ దేవర AP-TG డే 1 టార్గెట్ ఇదే…కాచుకోండి ఇక!

ఎన్టీఆర్ దేవర AP-TG డే 1 టార్గెట్ ఇదే…కాచుకోండి ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సోలో హీరో మూవీ వచ్చి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతుంది…2018 టైంలో అరవింద సమేత(Aravindha Sametha) మూవీ చేసిన ఎన్టీఆర్ తర్వాత పూర్తి టైం రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేసిన ఎపిక్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్(RRR Movie) తో ఫుల్ బిజీ అవ్వగా…

ఆ సినిమా వచ్చి కూడా 2 ఏళ్ళు అయిపోగా ఎట్టకేలకు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దేవర(Devara Part 1) మూవీ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ 6 ఏళ్ల గ్యాప్ లో తెలుగు రాష్ట్రాల మార్కెట్ కూడా భారీగా పెరిగి పోయింది…ఇలాంటి టైంలో…

ఎన్టీఆర్ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా…ఆర్ ఆర్ ఆర్ కి ముందు ఎన్టీఆర్ చేసిన సినిమాలు వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా జనతా గ్యారేజ్, జై లవ కుశ మరియు…

అరవింద సమేత లాంటి సినిమాలు 20 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను అందుకున్నాయి…ఒకసారి రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ ని గమనిస్తే…
#NTR’r Recent Movies 1st Day Collections(AP-TG)
👉#RRRMovie(Multi Starrer) – 74.11CR
👉#AravindhaSametha- 26.64Cr
👉#JaiLavakusa – 21.81Cr
👉#JanathaGarage – 20.50Cr

ప్రజెంట్ పెరిగిన మార్కెట్ లో టాప్ స్టార్స్ మూవీస్ అవలీలగా 35-40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ ఎన్టీఆర్ దేవర కి టాక్ ఏమాత్రం బాగున్నా కూడా అవలీలగా 40 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి…

ఇక కొన్ని టాక్ యునానిమస్ గా ఉంటే ఓపెనింగ్స్ మరింత భారీ లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దేవర 45-50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటే అది రిమార్కబుల్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఇక సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here