బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన ఎన్టీఆర్(Jr NTR) రామ్ చరణ్(Ram Charan) లు తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ ని ఒప్పుకుంటూ ఉండగా లాస్ట్ ఎన్టీఆర్ నుండి సోలో రిలీజ్ అయిన దేవర ఆడియన్స్ ముందుకు రాగా ఇక రామ్ చరణ్ నుండి సోలో మూవీ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి కి రిలీజ్ అయింది…
తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన చోట్ల దేవర ముందు గేమ్ చేంజర్ ఏమాత్రం పోటి ఇచ్చే కలెక్షన్స్ ని సాధించ లేక పోయింది…అదే టైంలో హిందీ లో మాత్రం సినిమా మంచి కలెక్షన్స్ నే సాధించగా మొదటి రోజు దేవర కన్నా బెటర్ గా హిందీ లో పెర్ఫార్మ్ చేసింది…అక్కడ సినిమాకి డీసెంట్ రిపోర్ట్ లు కూడా ఉండగా….
కలెక్షన్స్ పరంగా హిందీ లో దేవర కన్నా బెటర్ గా వీకెండ్ లో జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా ఇప్పుడు 3 రోజుల కలెక్షన్స్ పరంగా హిందీ లో దేవరనే ఓవరాల్ గా లీడ్ ను సొంతం చేసుకుని అక్కడ కూడా డామినేట్ చేసింది గేమ్ చేంజర్ ను…. మొత్తం మీద దేవర మూవీ హిందీ లో…
మొదటి రోజు 7.95 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…రెండో రోజు 9.50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మూడో రోజు ఏకంగా 12.07 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని 3 రోజుల్లో ఓవరాల్ గా 29.52 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో మంచి జోరు ని చూపించింది….అదే టైంలో గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే…
మొదటి రోజు 8.64 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…రెండో రోజు 8.43 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇక మూడో రోజు 9.52 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకోగా 3 రోజుల్లో ఓవరాల్ గా 26.59 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించింది….రెండు సినిమాల మధ్య 3 రోజుల కలెక్షన్స్ పరంగా గ్యాప్…
2.9 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా దేవర ఇక్కడ కూడా గేమ్ చేంజర్ మీద లీడ్ ని అందుకుంది….కానీ గేమ్ చేంజర్ మూవీ ఈ రోజు నుండి సంక్రాంతి అడ్వాంటేజ్ ఉన్న నేపధ్యంలో హిందీ లో ఈ వీక్ లో ఏమైనా హోల్డ్ ని చూపించి గ్రోత్ ని దక్కించు కునే అవకాశం అయితే ఉంది కానీ సినిమా ఎంతవరకు ఈ అడ్వాంటేజ్ ను వాడుకుంటుందో చూడాలి….