ఆర్ ఆర్ ఆర్ లాంటి మమ్మోత్ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఆ సినిమా సక్సెస్ ను టాలీవుడ్ ఎంజాయ్ చేస్తే…ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా లో ఎక్కువ క్రెడిట్ మా హీరోకి…లేదు మా హీరో కి అంటూ గొడవలు పడుతూనే వచ్చారు. ఇది ఆల్ మోస్ట్ 3 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా….
ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇద్దరు హీరోల సోలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలకు కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది, కానీ ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ సపోర్ట్ తో ఊహించిన దానికి మించి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే టైంలో…
గేమ్ చేంజర్ మూవీ మిక్సుడ్ టాక్ ఓ రేంజ్ లో నెగటివ్ గా మారినా ఫ్యాన్స్ కూడా కాపాడలేక చేతులు ఎత్తేశారు. దాంతో దేవర ముందు గేమ్ చేంజర్ ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నా కూడా తమిళ్ లో అక్కడ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ…
ఎంతో కొంత జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా దేవర తో పోల్చితే ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. దేవర అక్కడ కూడా మిక్సుడ్ టాక్ తోనే టోటల్ రన్ లో 4.16 కోట్ల షేర్ ని 11.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంటే…
గేమ్ చేంజర్ మూవీ సోలో సంక్రాంతి రిలీజ్ అండ్ శంకర్ ఫ్యాక్టర్స్ హెల్ప్ అయినా కూడా 9.72 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 4.32 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుంది. ఒక్కో సినిమాకి ఉండే అగ్రిమెంట్స్ డిఫెరెంట్ గా ఉండటంతో…గేమ్ చేంజర్ కి షేర్ కొంచం…
ఎక్కువ వచ్చినా కూడా గ్రాస్ పరంగా మాత్రం దేవర ఎక్కువ వసూళ్ళని అందుకుంది…ఓవరాల్ గా దేవరతో పోల్చితే ఆల్ రెడీ రామ్ చరణ్ కి తమిళ్ లో మార్కెట్ ఉండటం, శంకర్ ఫ్యాక్టర్ లు కలిసి వచ్చే అంశమే అయినా కూడా అనుకున్న అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది.