Home న్యూస్ దేవర భీభత్సం….గుంటూరులో రికార్డ్ హైర్స్…టైగర్ రాంపెజ్ స్టార్ట్!

దేవర భీభత్సం….గుంటూరులో రికార్డ్ హైర్స్…టైగర్ రాంపెజ్ స్టార్ట్!

0
Jr NTR Devara Part 1 Solid Hires Business in Guntur Area
Jr NTR Devara Part 1 Solid Hires Business in Guntur Area

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్ళు అవుతుంది….2018 టైంలో అరవింద సమేత(Aravindha Sametha) సినిమాతో రచ్చ చేసి తర్వాత పూర్తి టైంని ఆర్ ఆర్ ఆర్(RRR Movie)కే కేటాయించి ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎక్కువ టైం ఇప్పుడు ఆచార్య(Acharya) లాంటి ఎపిక్ డిసాస్టర్ తీసిన…

కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్1(Devara Part 1) తో మాస్ రచ్చ చేయబోతూ ఉండగా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద హైప్ ఆల్ రెడీ స్కై హై లెవల్ లో ఉండగా రిలీజ్ కి ఇంకా…

2 నెలల లోపు టైం మాత్రమే ఉండగా ఆల్ రెడీ బిజినెస్ పరంగా మాస్ రచ్చ చేస్తున్న ఈ సినిమా కి ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ లు భారీ ఆఫర్స్ వస్తూ ఉండగా సింగిల్ స్టేషన్ లు మాస్ సెంటర్స్ కి గాను హైర్స్ కూడా భారీ లెవల్ లో సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం..

ఆల్ రెడీ సీడెడ్ ఏరియాలో సెన్సేషనల్ హైర్స్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న దేవర మూవీ కి లేటెస్ట్ గా గుంటూరు ఏరియాలో సి డి సెంటర్స్ లో సెన్సేషనల్ హైర్స్ ఆఫర్ వచ్చింది. కోవిడ్ తర్వాత కొన్ని పెద్ద సినిమాలకు భారీగా ఎదురుదెబ్బలు తగలడంతో హైర్స్ తగ్గిపోయిన టైంలో…

గుంటూరు సి డి సెంటర్స్ లో సినిమా కి ఏకంగా 2 కోట్ల రేంజ్ లో ఆఫర్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యిందట. హైర్స్ అంటే కొన్ని సెంటర్స్ లో బయర్స్ గంపగుత్తుగా ఒక రేటుని కడతారు…ఇక ఆ ఏరియాలో లాభం వచ్చినా నష్టం వచ్చిన కొన్న వాళ్ళకే చెల్లుతుంది…

ఆ కట్టిన అమౌంట్ ని మాత్రం మొదటి రోజు, మొదటి వీకెండ్, వీక్ ఎండ్ లో షేర్స్ లో యాడ్ చేస్తారు…ఇప్పుడు గుంటూరులో ఆల్ రెడీ 2 కోట్ల హైర్స్ ను సొంతం చేసుకున్న దేవర హైప్ కి తగ్గట్లు మెప్పిస్తే మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here