Home న్యూస్ దేవర హిందీ డే 1 కలెక్షన్స్….బాలీవుడ్ గడ్డ మీద ఎన్టీఆర్ భీభత్సం!!

దేవర హిందీ డే 1 కలెక్షన్స్….బాలీవుడ్ గడ్డ మీద ఎన్టీఆర్ భీభత్సం!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది….సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ ను నమోదు చేసింది.

ఇక కర్ణాటకలో కూడా సినిమా రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా…అన్ని ఏరియాలు బాగానే పెర్ఫార్మ్ చేసినా హిందీలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా, హిందీ లో స్టార్ట్ అవ్వడం చాలా స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కూడా తర్వాత జోరు పెంచిన సినిమా…

ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సెన్సేషనల్ గా జోరు చూపించి దుమ్ము దులిపేసింది…5-6 కోట్ల దాకా వెళుతుంది, మించే అవకాశం ఉందని అనిపించినా కూడా ఓవరాల్ గా ఆ అంచనాలను సైతం మించి పోయిన సినిమా ఏకంగా 7 కోట్ల మార్క్ ని కూడా దాటేసిన దేవర మూవీ మొదటి రోజు ఏకంగా 7.95 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. అసలు ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన మూవీ కి ఇలాంటి ఓపెనింగ్స్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తర్వాత ఎన్టీఆర్ కి బాలీవుడ్ గడ్డ మీద ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ఇప్పుడు…

దేవర సినిమాతో సొంతం అవ్వడం విశేషం కాగా సినిమా రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండటంతో లాంగ్ వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని హిందీ లో అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. జోరు ఇలానే దసరా వరకు హిందీలో కొనసాగితే మంచి కలెక్షన్స్ తో లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here