లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే ఎక్స్ ట్రీమ్ లెవల్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఊహకందని రాంపెజ్ ను చూపించి మాస్ రచ్చ చేసిన మాన్ ఆఫ్ మాసెస్ అయిన ఎన్టీఆర్(Jr NTR) నటించిన రీసెంట్ మూవీ దేవర(Devara) లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో..
హోల్డ్ ని చూపించి అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంది. తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ గా కుమ్మేసిన సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 450 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ మరియు టీం కలిసి సినిమాను అక్కడ ప్రమోట్ చేశారు. ఇక ఓపెనింగ్స్ అదిరిపోతాయి అని అనుకున్నా కూడా అక్కడ రీసెంట్ గా అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అయిన రంగస్థలం, కల్కి లాంటి సినిమాల…
రేంజ్ లోనే బుకింగ్స్ ట్రెండ్ ఉందని చెప్పాలి. ఈ సినిమాలకు వీకెండ్ లో ఓవరాల్ గా 7200-7500 వరకు టికెట్స్ సేల్ అయ్యాయి. అదే టైంలో దేవర మూవీ కి ప్రీమియర్స్ అండ్ వీకెండ్ కలిపి అటూ ఇటూగా 7000 వరకు టికెట్ సేల్స్ జరిగినట్లు సమాచారం…
ఇండియన్ కరెన్సీలో అటూ ఇటూగా 60-65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అక్కడ సొంతం చేసుకుందని అంచనా వేయవచ్చు. టీం ఆర్ ఆర్ ఆర్ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్ పెర్ట్ చేసినా కూడా పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది సినిమా…
కానీ టాక్ పరంగా బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను అయితే సినిమా అక్కడ సొంతం చేసుకుందని సమాచారం. దాంతో అక్కడ సినిమాలకు ఎలాగూ లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.