టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసింది, ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉంది…కర్ణాటకలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది….
ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర కర్ణాటకలో ఓవరాల్ గా 16 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది….సినిమా రిలీజ్ అయిన రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సోషల్ మీడియా అంతటా స్ప్రెడ్ అవ్వడంతో లాంగ్ రన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అన్న డౌట్స్…
అందరిలోనూ ఏర్పడగా తెలుగు రాష్ట్రాల్లో అంటే క్రేజ్ వలన కుమ్మేస్తుంది కానీ ఇతర చోట్ల ఎలా హోల్డ్ చేస్తుందో అని అందరూ డౌట్స్ తోనే ఉన్నా కూడా మొదటి రోజే కర్ణాటకలో 10 కోట్ల మార్క్ గ్రాస్ కి పైగా కలెక్షన్స్ తో ఓపెన్ అయిన దేవర మూవీ…. తర్వాత టాక్ ఇంపాక్ట్ ను కూడా తట్టుకుని….
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకెండ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేసింది…ఇక సినిమా 10 రోజుల్లో బిజినెస్ మొత్తాన్ని రికవరీ చేయగా 11 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో కర్ణాటకలో 16 కోట్ల బిజినెస్ మీద…
లాభాలలోకి ఎంటర్ అయ్యి 36 కోట్లకు పైగా గ్రాస్ తో దుమ్ము దులిపెస్తూ దూసుకు పోతుంది. సినిమాను అమ్మిన రేటుకి మిక్సుడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ లో రచ్చ చేసి ఇప్పుడు లాభాల లోకి ఎంటర్ అయిన సినిమా దసరా సెలవుల వరకు ఇదే జోరుని కొనసాగిస్తే అక్కడ కూడా డీసెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.