Home న్యూస్ దేవర రన్ టైం లో మార్పు….వర్కౌట్ అయితే మాస్ రచ్చే ఇక!

దేవర రన్ టైం లో మార్పు….వర్కౌట్ అయితే మాస్ రచ్చే ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) కాంబోలో భారీ హైప్ నడుమ వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద క్రేజ్ సాలిడ్ గానే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేసిన ఈ సినిమా..

తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న సినిమా యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా ముందు రన్ టైం 2 గంటల 57 నిమిషాల రేంజ్ లో వచ్చింది. దాంతో ఆల్ మోస్ట్ సినిమా 3 గంటల రన్ టైంలో…

ఆడియన్స్ ముందుకు రాబోతుందని అందరూ అనుకుంటూ ఉండగా అంత రన్ టైం అంటే ఎక్కడో సినిమా లాగ్ అవుతుంది అన్న టాక్ మిక్సుడ్ టాక్ గా మారే ప్రమాదం ఉండటంతో మేకర్స్ ఈ విషయానికి ముందే గ్రహించి మళ్ళీ ఫైనల్ ఔట్ పుట్ ను చూసుకుని…

మరోసారి రీ ఎడిట్ చేసి ఈ సారి రన్ టైంని మరింత క్రిస్ప్ గా ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తుంది… ఆ వార్తల ప్రకారం సినిమా లేటెస్ట్ రన్ టైం 2 గంటల 42 నిమిషాల రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు. దాంతో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన దావుదీ వీడియో సాంగ్…

సినిమాలో కాకుండా సినిమా ఎండ్ క్రెడిట్స్ లో వస్తుందని సమాచారం, దాంతో ఓవరాల్ గా క్రిస్ప్ రన్ టైం తో రాబోతున్న దేవర మూవీ ఆడియన్స్ ను అలరించే విధంగా ఉంటే ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ మాస్ రచ్చ చేసి సంచలనం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here