టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన దేవర(Devara Part 1 Review and Talk) సినిమా ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ ను సొంతం చేసుకుంది…వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా…
ముందుగా స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా సినిమాకి మొదటి టాక్ కూడా బయటికి వచ్చేసింది….మరి సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ ని ఏమి లీక్ చేయడం లేదు కానీ సముద్ర పరిసర ప్రాంతంలో నివసించే ప్రజలను కొందరు…
దోచుకుంటూ ఉంటారు….అలాగే సముద్రంలో ఉన్న విలువైన సంపదను కూడా దోచుకోవాలని చూస్తారు…అలాంటి వాళ్ళని ఆపాలని చూసిన దేవర 2 ఏళ్ళుగా కనిపించడు…మరో పక్క భయస్తుడైన వర ఎలా ధైర్యవంతుడు అయ్యాడు….దేవర కనిపించకుండా ఏమయ్యాడు….అసలు ఆ మిస్టరీ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి ఫస్టాఫ్ లో మంచి హై ఇచ్చే మూమెంట్స్ తో పాటు అక్కడక్కడా కథ కొంచం స్లో నరేషన్ తో సాగినా కూడా వీలు ఉన్న ప్రతీ చోట ఓ మంచి ఎలివేషన్, పడుతూ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో…
పెరిగి పోయే రేంజ్ లో హై మూమెంట్స్ తో నిండిపోగా సెకెండ్ ఆఫ్ కథ ఆసక్తిగా స్టార్ట్ అయ్యి మధ్యలో డ్రాగ్ అయినా మళ్ళీ అక్కడక్కడా మంచి హై మూమెంట్స్, కొన్ని ఎక్స్ లెంట్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో దుమ్ము లేపగా…..ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు…
ఎన్టీఆర్ డిఫెరెంట్ రోల్స్ తో దుమ్ము లేపగా, హీరోయిజం ఎలివేట్ సీన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం, ఇక ఆ సీన్స్ కి అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో హైలెట్ గా నిలిచింది,…మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అలాగే సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ లో…
అనిపించిన దేవర ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టె సినిమా అని చెప్పొచ్చు, అదే టైంలో కామన్ ఆడియన్స్ కి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించే రేంజ్ సినిమాలా అనిపించే అవకాశం ఎక్కువగా ఉండగా లెంత్ కొంచం తగ్గించి ఉంటే బాగుండేది అనిపించగా కథ అక్కడక్కడా డ్రాగ్ అవ్వడం లాంటివి చిన్న చిన్న…
మైనస్ పాయింట్స్ అయినా కూడా ఓవరాల్ గా దేవర ఆడియన్స్ అంచనాలను చాలా వరకు అందుకునే సినిమానే అని చెప్పాలి. ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి సినిమాకి ఎబో యావరేజ్ కి పైగానే టాక్ వినిపిస్తూ ఉండగా రెగ్యులర్ షోల టైంకి ఇదే రేంజ్ టాక్ సస్టైన్ అయితే ఇక మాస్ రచ్చ ఖాయమనే చెప్పాలి ఇప్పుడు.