Home న్యూస్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ ట్రైలర్స్….దేవర ట్రైలర్ కి మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!

ఫాస్టెస్ట్ 100K లైక్స్ ట్రైలర్స్….దేవర ట్రైలర్ కి మైండ్ బ్లాంక్ రెస్పాన్స్!

1

కొత్త సినిమాలు ముఖ్యంగా పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సినిమా ల టీసర్ లు, ట్రైలర్ లు ఎలాంటి రికార్డులను సృష్టిస్తాయి అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు టాప్ స్టార్స్ నటించిన సినిమాలు తక్కువగానే రిలీజ్ అవ్వగా రీసెంట్ గా కల్కి మూవీ రాగా…

ఆ సినిమా వచ్చిన తర్వాత కొంత గ్యాప్ కి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara part 1) మూవీ అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది..

ఇక యూట్యూబ్ లో ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా చూసే ఫాస్టెస్ట్ 1 లక్ష రికార్డును దేవర ట్రైలర్ బ్రేక్ చేస్తుందని అందరూ అనుకున్నా అలా జరగలేదు…కొత్త రికార్డును నమోదు చేయకున్నా కూడా టాప్ 5 లో అయినా ఒకటిగా నిలుస్తుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా…

దేవర ట్రైలర్ కి 9 నిమిషాలకు పైగా టైం తీసుకుని 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకోగా….ఓవరాల్ గా టాప్ 5 లో కూడా నిలవలేక పోయింది. సలార్ మూవీ ట్రైలర్ 3 నిమిషాల్లో ఈ రికార్డ్ ను అందుకోగా భీమ్లా నాయక్ 4 నిమిషాల్లో ఈ రికార్డ్ ను అందుకుంది….

AP-TG 8th Day Highest Share Movies!!

ఒకసారి టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే….
Tollywood Fastest 100K Liked Trailers
👉#SalaarTrailer – 3mins~
👉#BheemlaNayak – 4Mins~
👉#VakeelSaab – 7~ mins
👉#Kalki2898AD – 7Mins+
👉#RRR – 8Mins+
👉#SarkaruVaariPaata – 9 Mins
👉#AdiPurush – 9 Mins+
👉#Devara – 9 Mins+*****
👉#GunturKaaram – 15Mins~
👉#Pushpa – 19Mins+
👉#BroTrailer – 21Mins
👉#Saaho – 27min
👉#RadheShyam – 27min
👉#WaltairVeerayya – 30Mins~

మొత్తం మీద దేవర ట్రైలర్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయంలో టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుంది, ఇక్కడ రికార్డులు మిస్ అయినా కూడా ఓవరాల్ గా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here