Home న్యూస్ దేవర ట్రైలర్ రివ్యూ…టైగర్ రాంపెజ్…రికార్డుల జాతర ఖాయం!

దేవర ట్రైలర్ రివ్యూ…టైగర్ రాంపెజ్…రికార్డుల జాతర ఖాయం!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ ఈ నెల ఎండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలను మరింతగా పెంచడానికి సినిమా నుండి ఇప్పుడు…

అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. ట్రైలర్ లో సినిమా కథ పాయింట్ ను కూడా రివీల్ చేయగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఎన్టీఆర్…

రెండు రోల్స్ లో కూడా అదరగొట్టేసినట్లు తెలుస్తుంది…తీర ప్రాంతంలో ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటారు విలన్ అతని గ్యాంగ్…ఆ విలన్ ని ఎదిరించడానికి ఎవ్వరూ ముందుకు రారు…అలాంటి వాళ్ళని ఎదిరించి ఆ ప్రజలకు సముద్రానికి అండగా నిలుస్తాడు హీరో…..

దేవర ని చంపాలి అంటే సరైన సమయంతో పాటు సరైన ఆయుధం కూడా కావాలని ఎదురుచూస్తున్న విలన్ సైఫ్ అలీ ఖాన్ కి సరైన సమయం వస్తుంది….దేవర 2 ఏళ్ళుగా కనిపించకుండా పోతాడు….ఆ తర్వాత కథ ఏమయింది…దేవరతో పోల్చితే చాలా అమాయకుడు అయిన అతని కొడుకు ఏం చేశాడు అన్నది మిగిలిన కథ….

కథ పాయింట్ కొంచం రొటీన్ గానే అనిపించినా కూడా ఎంచుకున్న నేపధ్యం చాలా కొత్తగా ఉండేలా చూసుకున్న కొరటాల శివ ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేంజ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ హీరోయిజం, ఎలివేషన్ లు అన్నీ ట్రైలర్ లో కుమ్మేశాయి…

ఇక అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు….మొత్తం మీద ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలను అందుకుందా లేదా అంటే కచ్చితంగా అంచనాలను అందుకుంది అని చెప్పొచ్చు ట్రైలర్….ఇక ఇదే రేంజ్ లో సినిమా ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here