బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో కూడా సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1), 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సోలో మూవీ అవ్వగా అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా…
మొదటి వీకెండ్ ని ఊహకందని కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది…మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ముందు నుండి అంచనాలకు తగ్గట్లే జోరు చూపించగా హిందీలో సాలిడ్ గ్రోత్ ని చూపించిన సినిమా మొదటి నుండి కూడా ఓవర్సీస్ లో….
అనుకున్న దానికి మించి ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది….సినిమా నార్త్ అమెరికాలో 5 మిలియన్ మార్క్ రేంజ్ లో ఊచకోత కోసింది. టోటల్ ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో వీకెండ్ లో రచ్చ చేసింది….
ఓవరాల్ గా టోటల్ ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లోనే బిజినెస్ ను రికవరీ చేసింది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో సాధించిన కలెక్షన్స్ తో 30 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా…టోటల్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకుని…
లాభాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది. ఓవరాల్ గా సినిమా మిక్సుడ్ టాక్ తోనే మాస్ కంటెంట్ తో ఓవర్సీస్ లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా ఇక మిగిలిన ఏరియాల్లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో…..
బ్రేక్ ఈవెన్ ని ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి ఇక… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో వచ్చిన టాక్ దృశ్యా ఊహకందని రాంపెజ్ నే చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….