టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) అరవింద సమేత(Aravindha Sametha) సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు సోలో హీరోగా వస్తున్న కొత్త సినిమా దేవర పార్ట్1(Devara Part 1) ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత వస్తూ ఉండగా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి…
లాస్ట్ ఇయర్ సలార్(Salaar) తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న బిగ్ మాస్ మూవీ ఇదే అవ్వడంతో ఇండియన్ మూవీస్ పరంగా అన్నీ అనుకున్నట్లు జరిగితే పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉన్న దేవర మూవీ మరో నెల రోజుల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతుంది..
కాగా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం, సాంగ్స్ ఆల్ రెడీ సాలిడ్ గా హిట్ అవుతూ ఉండటంతో ట్రైలర్ ఒక్కటి అనుకున్న రేంజ్ లో క్లిక్ అయితే ఇక పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ లేపే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా రిలీజ్ కి ఇప్పటి నుండే పక్కా ప్లానింగ్ జరుగుతూ ఉండగా…
దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రోజున వసూళ్ళ పరంగా అంచనాలను మించే ఓపెనింగ్స్ రావడానికి సన్నాహాలు మొదలు అయ్యాయి అని చెప్పాలి. మాములుగా రిలీజ్ రోజున 4-5 షోలు వేయడం జరుగుతుంది కానీ దేవర విషయంలో మేకర్స్ ఇప్పుడు రిలీజ్ రోజు కన్నా ముందే…
మిడ్ నైట్ షోల నుండే గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని, తద్వారా ఓవర్సీస్ లో అలాగే ఇండియాలో ఒకే టైంలో ప్రీమియర్ షోలతో ఓపెన్ కాబోతూ ఉండటంతో టాక్ అనుకున్న రేంజ్ లో వస్తే అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ కన్నా కూడా మరో 2 షోలు అధికంగా యాడ్ అవుతాయి కాబట్టి…
తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఓ రేంజ్ భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఇవన్నీ అనుకున్న రేంజ్ లో జరిగితే అటు ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ఇటు ఇండియాలో సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే 1 దేవర ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇక…