Home న్యూస్ దేవర ఫస్ట్ టాక్ వచ్చేసింది….సెన్సార్ రిపోర్ట్ ఇదే!

దేవర ఫస్ట్ టాక్ వచ్చేసింది….సెన్సార్ రిపోర్ట్ ఇదే!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) మూవీ ఈ శుక్రవారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా…

మొత్తం మీద 2 గంటల 51 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది…కాగా సినిమా సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చింది…ఆ టాక్ ప్రకారం సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ భీభత్సం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ సముద్రం చుట్టుపక్కల ఉండే వాళ్లకి భయం పుట్టించిన దేవర…సముద్రంలో ఎవ్వరూ ఎలాంటి తప్పులకు పాల్గపడకుండా చూసుకుంటాడు..కానీ సరైన సమయం చూసి దేవరని మట్టు పట్టాలని చూస్తున్న విలన్ లు, ఎలా దేవర అడ్డు…

తొలగించడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి…భయస్తుడైన వర భయాన్ని ఎలా వీడాడు అన్నది కథ పాయింట్ అని అంటున్నారు…ఇది కాక సినిమాలో మెయిన్ పాయింట్ మరొకటి ఉందని, అది సినిమా చూస్తేనే కిక్ ఉంటుందని చెబుతున్నారు….ఓవరాల్ గా కథ పాయింట్ కొంచం బేసిక్ గా అనిపించినా కూడా…

కొన్ని ఆసక్తి కలిగించే ట్విస్ట్ లు, ఎక్స్ లెంట్ ఫైట్ సీన్స్, ఎన్టీఆర్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ అండ్ హీరోయిజం సెన్స్ అండ్ అనిరుద్ మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని, అలాగే సినిమా స్టార్టింగ్, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ అలాగే సెకెండ్ ఆఫ్ లాస్ట్ అరగంట మేజర్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు…

రొటీన్ కథ, అలాగే లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం లాంటివి ఆడియన్స్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉండే దేవర అందరి అంచనాలను అందుకునే సినిమా అవుతుంది అన్న టాక్ సెన్సార్ వాళ్ళ నుండి వినిపిస్తుంది. మొత్తం మీద గుడ్ ఫస్టాఫ్ ఎబో యావరేజ్ సెకెండ్ ఆఫ్ అన్నట్లు…

టాక్ అయితే దేవర సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి వినిపిస్తుంది. సెన్సార్ వాళ్ళ నుండి చాలా వరకు సినిమాలకు రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంటుంది, ఈ సినిమా కి కూడా బజ్ అండ్ టాక్ అదే రేంజ్ లో ఉన్నప్పటికీ ఇదే నిజం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పిస్తుంది. మరి ఇదే కనుక నిజం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ మాస్ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here