Home న్యూస్ రికార్డుల దుమ్ము లేపుతున్న దేవర 2nd సాంగ్…ఫాస్టెస్ట్ 50M తో టాలీవుడ్ రికార్డ్!

రికార్డుల దుమ్ము లేపుతున్న దేవర 2nd సాంగ్…ఫాస్టెస్ట్ 50M తో టాలీవుడ్ రికార్డ్!

0
Devara 2nd Song Chuttamalle Fastest 50M Views Record In TFI
Devara 2nd Song Chuttamalle Fastest 50M Views Record In TFI

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) సోలో హీరోగా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara part1) సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోతూ ఉండగా లేటెస్ట్ గా మూవీ నుండి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు…

చుట్టమల్లె అంటూ లిరిక్ తో వచ్చిన ఈ రొమాంటిక్ డ్యూయెట్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవుతుంది అని చెప్పాలి….మొదటి 24 గంటల్లో ఎక్స్ లెంట్ వ్యూస్ అండ్ లైక్స్ ను సొంతం చేసుకున్న తర్వాత కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ…

దూసుకు పోతున్న ఈ సాంగ్ ఇప్పుడు టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం…ఆల్ మోస్ట్ ఒక వారం గ్యాప్ లోనే ఈ సాంగ్ కి తెలుగు వర్షన్ లో ఏకంగా 50 మిలియన్ వ్యూస్ మార్క్ సొంతం అవ్వగా…

టాలీవుడ్ లో ఇది వరకు పుష్ప సినిమా నుండి వచ్చిన ఊ అంటావా సాంగ్ 8 రోజుల గ్యాప్ లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా ఇప్పుడు ఈ రికార్డ్ ను దేవర సెకెండ్ సాంగ్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ తో దూసుకు పోతున్న..

దేవర సినిమా 2వ సాంగ్ ఓవరాల్ గా 75 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసి మాస్ రచ్చ చేసింది….ఎన్టీఆర్ అనిరుద్ ల క్రేజీ కాంబోకి ఉన్న క్రేజ్ పవర్ ను నిజం చేస్తూ ఎక్స్ లెంట్ రీచ్ ను సొంతం చేసుకుంటున్న దేవర సినిమా లో మిగతా పాటలు ఇక ఏ రేంజ్ లో రచ్చ చేస్తాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here