Home న్యూస్ దేవర 2nd సాంగ్ రివ్యూ….చాలా టైం తర్వాత ఎన్టీఆర్ కి ఫస్ట్ టైం!

దేవర 2nd సాంగ్ రివ్యూ….చాలా టైం తర్వాత ఎన్టీఆర్ కి ఫస్ట్ టైం!

0

టాలీవుడ్ యంగ్ టైగర్(Jr NTR) చాలా టైం తర్వాత సోలో హీరోగా చేస్తున్న సినిమా దేవర(Devara part1)…అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న ఈ సోలో మూవీ మీద హైప్ ఆల్ రెడీ భారీ లెవల్ లో ఉంది…ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడా అని అందరూ..

ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా సెప్టెంబర్ ఎండ్ లో రిలీజ్ కానుండగా సినిమా నుండి ఆల్ రెడీ వచ్చిన గ్లిమ్స్ అండ్ ఫస్ట్ సాంగ్ లు మంచి హైప్ ను సొంతం చేసుకున్న తర్వాత సినిమా నుండి ఇప్పుడు లేటెస్ట్ గా సెకెండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు…

ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ ల కాంబోలో రూపొందిన ఈ సాంగ్ చుట్టమల్లె అంటూ లిరిక్ తో తెరకెక్కగా అందరూ సాంగ్ ఎదో డ్యూయెట్ గా ఉంటుంది అనుకున్నారు కానీ అందరినీ ఆశ్యర్య పరుస్తూ హీరో హీరోయిన్స్ మధ్య మంచి రొమాంటిక్ సాంగ్ గా సాంగ్ ను రూపొందించారు…

స్లో సాంగ్ అవ్వడంతో ఫస్ట్ టైం విన్నప్పుడు బాగుంది అనిపించిన ఈ సాంగ్ రిపీట్స్ లో బాగానే ఇంప్రెస్ చేయగా సాంగ్ విజువల్ పరంగా గ్రాండియర్ గా తెరకెక్కించగా అప్పుడెప్పుడో టెంపర్ లో రొమాంటిక్ టచ్ ఉన్న సాంగ్ చేసిన ఎన్టీఆర్ ఆ సినిమా తర్వాత చాలా టైంకి మళ్ళీ ఇప్పుడు…

ఫుల్ లెంత్ రొమాంటిక్ సాంగ్ ను చేశాడు….దాంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉండగా యూత్ ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఎక్కువగా ఉన్న ఈ సాంగ్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా మెప్పించడంతో ఇక యూట్యూబ్ లో 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here