డిసెంబర్ మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా…
కచ్చితంగా ఓపెనింగ్ డే నుండి లాంగ్ రన్ లో ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను ఈ సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం సినిమా రికార్డ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…ముఖ్యంగా ఒక ఏరియాలో…
ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది మాత్రం ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి. ఆ ఏరియానే రాయలసీమ ఏరియా….ఇక్కడ మాస్ సినిమాలకు మరో లెవల్ లో కలెక్షన్స్ సొంతం అవుతూ ఉంటాయి. పుష్ప మొదటి పార్ట్ ఇక్కడ మొదటి రోజు 4.20 కోట్ల రేంజ్ లో..
షేర్ ని అందుకోగా అందులో 1.12 కోట్ల రేంజ్ లో హైర్స్ ఉన్నాయి…రీసెంట్ టైంలో ఇక్కడ టాలీవుడ్ మాన్ మాఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర(Devara Part 1) ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
మొదటి రోజు నుండి లాంగ్ రన్ వరకు ఎపిక్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 10.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా అందులో 1.95 కోట్ల రేంజ్ లో హైర్స్ కూడా ఉన్నాయి…రీసెంట్ టైంలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇక్కడ ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్…
వర్త్ షేర్ ని మొదటి రోజు అందుకున్న సినిమాగా నిలిచిన దేవర కలెక్షన్స్ ని ఇప్పట్లో అందుకోవడం కష్టమే అని అందరూ అనుకుంటూ ఉన్న, మోస్ట్ హైప్ తో వస్తున్న పుష్ప2 కి ఈ ఛాన్స్ అయితే ఉందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప2 ఈ ఏరియాలో దేవర డే 1 ని కొడుతుందో లేదో చూడాలి…