టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) భారీ అంచనాల నడుమ ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…కాగా ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో…
అలాంటి హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో, అనిరుద్ మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో దుమ్ము లేపేశాడు… ఇక కామన్ ఆడియన్స్ లో కూడా మంచి రీచ్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మాత్రం మిక్సుడ్ రెస్పాన్స్ ఎక్కువగా వినిపిస్తుంది…
దానికి ప్రదాన కారణం సినిమా ట్రైలర్ లో చూపించిన స్టోరీ పాయింట్ అని అంటున్నారు…ఎందుకంటే ఆ పాయింట్ కొద్ది వరకు కొరటాల శివ ఇది వరకు తీసిన ఎపిక్ డిసాస్టర్ ఆచార్య(Acharya) ని పోలి ఉన్నట్లు అనిపిస్తుంది అన్నది వాళ్ళ టాక్….ట్రైలర్ లో చూపించినట్లు హీరో వెనక ఉన్న వాళ్ళే…
తనని చంపాలని చూడటం అనే కాన్సెప్ట్ ఆల్ రెడీ ఆచార్యలో రామ్ చరణ్(Ram Charan) ఫ్రెండ్ గా ఉండే సోనూ సూద్ తనని చంపడం, అలాగే అక్కడ ధర్మస్థలి, పాదగట్టం లాంటి ఏరియాలు పదాలు వాడగా ఇక్కడ వచ్చేసరికి సముద్రం పరిసర ప్రాంతంలో ఈ కథ ఉండటంతో…
ఇవి కూడా కంపేర్ చేస్తున్నారు….దాంతో పాటు ప్రశాంత్ నీల్ ఉగ్రమ్ మీద ప్రేమతో సలార్ లా భారీగా తీస్తుంటే ఇప్పుడు కొరటాల ఆచార్య ఎందుకు ఫ్లాఫ్ అయిందని, అదే కథని పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు…
ఇలా సినిమా ట్రైలర్ పైన సోషల్ మీడియాలో ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం మిక్సుడ్ గా వచ్చింది…కానీ రెగ్యులర్ ఆడియన్స్ నుండి మాత్రం సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ బాగానే ఉంది, అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవగా….
ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ షాట్స్ అన్నీ ఎక్స్ లెంట్ గా ఉండటంతో పాటు ట్రైలర్ ఎండ్ లో సముద్రంలో ఉండే ఫైట్ సీన్ పై హైప్ పెరిగిపోయింది. ఇక ట్రైలర్ ఎండ్ లో షార్క్ తో ఎగురుతూ ఎన్టీఆర్ బయటికి వచ్చే సీన్ గ్లిమ్స్ హైలెట్ గా నిలిచాయి. మీరు చూసి చాలా చిన్న సీన్స్ మాత్రమే అంటూ…
టీం చెబుతూ ఉండటం, సినిమా మీద ఫుల్ నమ్మకంతో వాళ్ళు ఉండటంతో ట్రైలర్ కి సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉన్నా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.