మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను అయితే సొంతం చేసుకోలేదు… తన రీసెంట్ మూవీస్ లో క్రాక్ మూవీ ఒక్కటే బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోక మిగిలిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేదు. ఇక ఇప్పుడు రవితేజ ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కానుండగా…వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా…
రవితేజ సినిమాకి అనుకున్న దానికన్నా కూడా మంచి బిజినెస్ జరగగా ఓవరాల్ గా నిర్మాతకి లాభాలనే సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి. కాగా సినిమాను మొత్తం మీద 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించినట్లు సమాచారం. ఇక సినిమా కి మొత్తం మీద నాన్ థియేట్రికల్ రైట్స్ కింద…
ఓవరాల్ గా 32 కోట్ల దాకా రికవరీ అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 18.30 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపగా టోటల్ గా సినిమా బిజినెస్ వాల్యూ 50.30 కోట్ల దాకా సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా బడ్జెట్ మీద 10.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను మేకర్స్ కి దక్కేలా చేసిన సినిమా తో వరుస ఫ్లాఫ్స్ లో కూడా రవితేజ మరోసారి తన స్టామినాని నిరూపించాడు. పబ్లిసిటీ ఖర్చులు 3-4 కోట్లు అనుకున్నా కానీ మేకర్స్ కి 6 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కిందని చెప్పాలి. ఇక థియేట్రికల్ రన్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే లాభాలు ఇంకా సొంతం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాలి.