మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో వచ్చేసింది. కాగా సినిమా సాంగ్స్ బాగా ఇంప్రెస్ చేయడం, ట్రైలర్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉండటం యూనిట్ సినిమాను బాగా ప్రమోట్ చేయడంతో వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో భారీగానే రిలీజ్ అయిన ధమాకా సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే… జాబ్ కోసం ట్రై చేస్తున్న బస్తీ హీరో…అలాగే పీపుల్ మార్ట్ అనే కంపెనీ అధినేత కొడుకు అయిన మరో హీరో….
ఆ కంపెనీని చేజిక్కించుకోవాలని చూసే జయరాం నుండి ఎలా హీరో కంపెనీని కాపాడుకున్నాడు అన్నది కథ పాయింట్, ఇంతకీ ఒకేలా ఉండే హీరోలు ఇద్దరికీ ఉన్న లింక్ ఏంటి, ఇద్దరు ఏం చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ముందుగా కథ పాయింట్ చాలా చాలా రొటీన్ గా ఉంటుంది, 90’s టైం నాటి కథ పాయింట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో కూడా సినిమా ఎలా ఉంటుందో అదే చూపించారు…
సినిమా యూనిట్ కూడా కథ గొప్పదేమీ కాదు కానీ అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ చెప్పారు. ఇది గుర్తు పెట్టుకుని సినిమా చూడటం స్టార్ట్ చేస్తే సినిమా పర్వాలేదు బాగుంది అనిపిస్తుంది, లేదు ఎదో గొప్ప కథని చూడబోతున్నాం అని వెళితే మట్టుకు ఈ రొటీన్ కథకి బోర్ ఫీల్ అవ్వడం ఖాయం. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా రవితేజ ఫుల్ ఎనర్జీతో కుమ్మేశాడు… మాస్ ఎలివేషన్స్ కూడా బాగున్నాయి, హీరోయిన్ పార్ట్ కొంచం ఓవర్ ది టాప్ లా అనిపించినా పర్వాలేదు అనిపిస్తుంది. మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో మెప్పించగా….
మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ హైలెట్స్ లో ఒకటి, కామెడీ కూడా కొన్ని సీన్స్ లో బాగానే మెప్పిస్తుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించగా క్లైమాక్స్ కూడా బాగానే ఇంప్రెస్ చేస్తుంది. మొత్తం మీద సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ రొటీన్ కథ అండ్ స్క్రీన్ ప్లే…. సినిమా చూస్తున్నప్పుడు ఆ కథలో తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆల్ మోస్ట్ గెస్ చేయగలం… కథనే బలంగా లేక పోవడంతో కథ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టింది, ప్రీ ఇంటర్వెల్ నుండి కొంచం జోరు అందుకుంటుంది కథ…
ఇక సెకెండ్ ఆఫ్ స్టార్టింగ్ లోనే ఏం జరుగుతుంది అన్నది ఆడియన్స్ కి ఈజీగా తెలిసిపోతుంది, కథ కూడా అలానే కొనసాగుతుంది, కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అవ్వడంతో పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా రొటీన్ కమర్షియల్ మూవీ కానీ ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది, మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…. రవితేజ లాస్ట్ 2 మూవీస్ కన్నా కొంచం బెటర్ మూవీ…