మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా ఆడియన్స్ ముందుకు ఈ క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ ఆడియన్స్ ను చాలా వరకు ఆకట్టుకోగా రవితేజ మాస్ లుక్స్ అండ్ హీరోయిజం సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి ట్రైలర్. క్వాలిటీ కూడా ఎక్స్ లెంట్ గా ఉండటంతో మొత్తం మీద…
మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను అయితే పెంచింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా జోరు చూపుతుంది అన్నది మాత్రం మరో వారం ఆగితే క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పాలి.
ఇక సినిమా ట్రైలర్ మొత్తం మీద 24 గంటల్లో యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ తో కలిపి 5.20 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా 136.3K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా మంచి కౌంట్ నే సొంతం చేసుకున్నా…
లైక్స్ పరంగా మాత్రం రవితేజ ఇతర సినిమాలతో పోల్చితే మాత్రం అనుకున్న రేంజ్ లో లైక్స్ రాలేదు అనే చెప్పాలి. కానీ సినిమాకి ట్రైలర్ కి అయితే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని చెప్పాలి.