బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా ఊచకోత కోసింది. ఈ సినిమా కన్నా ముందు వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేసిన రవితేజ ఈ సినిమా ఈ రేంజ్ లో కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడని రిలీజ్ రోజు సినిమా రివ్యూలు చూసిన తర్వాత….
ఎవ్వరూ కూడా పెద్దగా అంచనా వేయలేదు. ఆ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయగా నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా కూడా ఈ సినిమా ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్స్ లెంట్ బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి..
సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కింద 7 కోట్లు, తెలుగు డిజిటల్ రైట్స్ కింద 8.50 కోట్లు సొంతం చేసుకోగా హిందీ శాటిలైట్ రైట్స్ కింద 6.50 కోట్లు, హిందీ డిజిటల్ రైట్స్ ఆల్ మోస్ట్ 9 కోట్ల రేటుని సొంతం చేసుకోగా మ్యూజిక్ రైట్స్ కింద 1 కోటి దాకా సొంతం చేసుకుంది.
ఓవరాల్ గా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ ఏకంగా 32 కోట్ల మార్క్ ని అందుకుంది. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకుని బడ్జెట్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసిన ధమాకా బాక్స్ ఆఫీస్ రన్ లో కూడా అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సాధించి సంచలనం సృష్టించింది.