బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి రొటీన్ మూవీ అన్న టాక్ వచ్చినా కావలసినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ గుడ్ సాంగ్స్ ఉండటంతో ఓపెనింగ్ డే రోజున ఉగాది హాలిడే కూడా కలిసి రావడంతో సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
సొంతం చేసుకుని దుమ్ము లేపేసింది. సినిమా ఇక ఫస్ట్ డే నే సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని రెండు తెలుగు రాష్ట్రాల ఆవల సొంతం చేసుకోవడం విశేషం. సినిమా అమెరికాలో ప్రీమియర్స్ తో 93 వేల డాలర్స్ ను అందుకోగా డే 1 ఆల్ మోస్ట్ 63 వేల డాలర్స్ ను అందుకుంది.
ఓవరాల్ గా ఇంకొన్ని లోకేషన్స్ ట్రాక్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో అమెరికాలో 158K మార్క్ ని అందుకున్న సినిమా 1.29 కోట్ల గ్రాస్ మార్క్ ని అక్కడే అందుకోగా ఇండియాలో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కూడా…
ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ లభించడంతో సినిమా 70 లక్షల బిజినెస్ ను దాటేసి ఆల్ మోస్ట్ 1 కోటి రేంజ్ షేర్ ని సాధించి రెండు తెలుగు రాష్ట్రాల ఆవల బ్రేక్ ఈవెన్ ని అందుకుందని చెప్పొచ్చు. ఇక మీదట వచ్చేవన్నీ కూడా సినిమాకి ఇక్కడ మంచి లాభాలను సొంతం అయ్యేలా చేస్తాయని చెప్పాలి. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో లాంగ్ వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.