సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో ఉండటం తో దాదాపు మళ్ళీ చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాలు అన్నీ కూడా రిలీజ్ లు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండగా చాలా సినిమాలు మంచి ఆఫర్స్ వస్తే డిజిటల్ రిలీజ్ లు చేయాలనీ చూస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలకే అలాంటి ఆఫర్స్ వస్తూ ఉండగా లేటెస్ట్ గా సెకెండ్ వేవ్ కన్నా ముందే ఎందుకో కొత్త సినిమాను థియేటర్స్ లో కాకుండా….
డిజిటల్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు కోలివుడ్ స్టార్ హీరో ధనుష్… భారీ లెవల్ లో వివిధ భాషల్లో రూపొందిన జగమే తంత్రం సినిమాను డిజిటల్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత అనౌన్స్ చేయగా అప్పటి నుండి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇక రీసెంట్ గా సినిమా డిజిటల్ రిలీజ్ కి సంభందించిన డీల్ విషయాలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల ప్రకారం సినిమాకి సెన్సేషనల్ అనిపించే రేంజ్ రేటు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి గాను సొంతం అయ్యిందని సమాచారం. కోలివుడ్ లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్…
బిజినెస్ ఆఫర్ గా చెబుతున్నారు… లీడింగ్ OTT యాప్ అయిన నెట్ ఫ్లిక్స్ వాళ్ళు జగమే తంత్రం సినిమా కోసం ఏకంగా 55 కోట్ల భారీ రేటు చెల్లించి డిజిటల్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. దాంతో ఇది తమిళ్ లో బిగ్గెస్ట్ రేటు గా చెబుతున్నారు. సినిమా రిలీజ్ డేట్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని అంటున్నారు ఇప్పుడు.
సినిమాను జూన్ 18 న సౌత్ భాషల్లో అన్నింట్లో ఒకేసారి డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రేంజ్ రేటు సొంతం అవ్వడం అంటే మాములు విషయం కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత బిజినెస్ జరిగినా బ్రేక్ ఈవెన్ కి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించాలి. కానీ డిజిటల్ రిలీజ్ ఈ రేటు వలన నిర్మాతకి ఫుల్ ప్రాఫిట్స్ దక్కాయి అంటూ చెబుతున్నారు ఇప్పుడు.