Home న్యూస్ రాయన్ ట్రైలర్ రివ్యూ….సింహం వేటకి వస్తుంది!!

రాయన్ ట్రైలర్ రివ్యూ….సింహం వేటకి వస్తుంది!!

0

Dhanush Raayan Telugu Trailer Review

Dhanush Raayan Telugu Trailer Reviewకోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న యాక్టర్స్ లో ఒకరైన ధనుష్(Dhanush) లాస్ట్ ఇయర్ తెలుగు లో సార్ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈ ఇయర్ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ మూవీతో నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడు…

ఆ సినిమా తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) ని తానె స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఉండగా సినిమా మీద మంచి బజ్ ఉంది. ఈ నెల 26న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను…

రీసెంట్ గా రిలీజ్ చేయగా రివేంజ్ డ్రామా అనిపిస్తున్న సినిమా ట్రైలర్ వరకు బాగానే మెప్పించింది అని చెప్పాలి. సెల్వరాఘవన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ లో…అడవిలో బలమైన జంతువులూ సింహం పులి అయినా కూడా ప్రమాదకరమైన జంతువూ తోడేలు అని చెబుతూ…

ఎదురుదెబ్బ తీయడంలో తోడేలు ముందు నిలుస్తుందని కథని చెప్పగా సింహం అదును చూసి వేటాడాల్సిఉంటుందని కథని బాగానే ప్రజెంట్ చేశారు…మొత్తం మీద విలన్స్ వలన హీరోకి ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత సింహంలా వేటని మొదలు పెట్టె హీరో…

తన రివేంజ్ ను ఎలా తీర్చుకున్నాడు అన్నది కథ పాయింట్ గా ట్రైలర్ లో చూపించగా ధనుష్ మరోసారి తన లుక్స్ అండ్ యాక్టింగ్ తో మెప్పించాగా ట్రైలర్ కి రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ప్లస్ అయింది… 

ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద అంచనాలను బాగానే పెంచగా 26న తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో ఇక్కడ కూడా ధనుష్ మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here