Home న్యూస్ హిట్టు కొట్టి 7 ఏళ్ళు…ఇక్కడ 8 ఏళ్ళు…కెరీర్ టర్నింగ్ మూవీ సీక్వెల్ కన్ఫాం అయింది!

హిట్టు కొట్టి 7 ఏళ్ళు…ఇక్కడ 8 ఏళ్ళు…కెరీర్ టర్నింగ్ మూవీ సీక్వెల్ కన్ఫాం అయింది!

488
0

కామెడీ మూవీస్ కి టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్ లు మాత్రమే ఉన్నారు, అలాంటి వాళ్ళలో పీక్ టైం ని ఎంజాయ్ చేసిన డైరెక్టర్ శ్రీనువైట్ల…సొంతం, వెంకీ, ఢీ, దుబాయి శీను లాంటి అల్టిమేట్ కామెడీ ఎంటర్ టైనర్స్ ని తీసిన శ్రీనువైట్ల తర్వాత స్టార్ డైరెక్టర్ అయినా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని తీస్తూ వచ్చారు కానీ బాద్ షా తర్వాత హిట్స్ కి దూరం అయ్యారు, మరో పక్క…

కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు ఢీ తో సాలిడ్ హిట్ కొట్టగా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న విష్ణు దేనికైనా రెడీ తో మళ్ళీ హిట్ కొట్టినా తర్వాత సోలో హీరోగా హిట్ కి దూరం అయ్యి 8 ఏళ్ళు అవుతుంది.

ఇలాంటి టైం లో ఈ ఇద్దరికీ కెరీర్ టర్నింగ్ మూవీ గా మారిన ఢీ సినిమాకి సీక్వెల్ ని మొదలు పెట్టాలని భావించినా ఎప్పటికప్పుడు ఎదో ఒక రీజన్ తో ఆగిపోతు రాగా ఎట్టకేలకు రీసెంట్ గా మంచు విష్ణు పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా సీక్వెల్ ని…

అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఢీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. కానీ ఢీ కి పనిచేసిన కోనవెంకట్ మరియు గోపీమోహన్ లలో కేవలం గోపీమోహన్ ని మాత్రమే తీసుకోగా కోనవెంకట్ ని తీసుకోలేదు, ఇక ఈ సినిమా కి టైటిల్ గా ఢీ అండ్ ఢీ… డబుల్ డోస్ అంటూ మంచి టైటిల్ నే పెట్టారు.

టోటల్ స్టార్ కాస్ట్ అండ్ షూటింగ్ డీటైల్స్ త్వరలో చెప్పనున్నారని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఈ సినిమా తో మరోసారి తమ కెరీర్ టర్నింగ్ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. మనం కూడా అదే ఆశిద్దాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here