బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ధూమ్ ధాం(Dhoom Dham Movie Review) డీసెంట్ లెవల్ లో రిలీజ్ అయింది….ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాలో కామెడీ క్లిక్ అవుతుంది అనిపించగా సినిమా ఆడియన్స్ కు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసు కుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే తండ్రి అంటే హీరోకి ఇష్టం, హీరో ని నంబర్ 1 గా చూడాలి అనుకునే తండ్రి, మధ్యలో లవ్ స్టోరీ, ఒక చిన్న ప్రాబ్లం, ఇలాంటి టైంలో హీరో చేసిన పని ఏంటి…ఓవరాల్ గా తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన సినిమా కథ….
మొత్తం మీద చాలా బేసిక్ స్టోరీ పాయింట్ తో వచ్చిన ధూమ్ ధాం మూవీలో ఆకట్టుకునే సీన్స్ అలాగే కామెడీ సీన్స్ చాలానే వర్కౌట్ అయ్యాయి, కానీ కథ అంత బలంగా లేక పోవడంతో సీన్ బై సీన్ మెప్పించినా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపించలేదు…
హీరో చేతన్ కృష్ణ పెర్ఫార్మెన్స్ పరంగా పర్వాలేదు అనిపించగా యాక్టింగ్ కూడా ఓకే అనిపించాడు…ఇక సాయి కుమార్ పెర్ఫార్మెన్స్ మెప్పించగా సెకెండ్ ఆఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ సినిమాను చాలా వరకు సేఫ్ చేసింది అని చెప్పాలి…
దాంతో ఫస్టాఫ్ లో కథ చాలా ఫ్లాట్ గా సాగగా ఇంటర్వెల్ తర్వాత వెన్నెల కిషోర్ కామెడీ హెల్ప్ తో సీన్ వైజ్ కొన్ని సీన్స్ బాగానే ఆకట్టుకుంటూ సాగి క్లైమాక్స్ రెగ్యులర్ గానే ఎండ్ అవుతుంది…ఓవరాల్ గా కామెడీ పరంగా సినిమా పర్వాలేదు అనిపించినా కథ పరంగా ఒక టైంలో..
టాలీవుడ్ లో ఎక్కువగా శ్రీనువైట్ల టెంప్లెట్ లో వచ్చిన సినిమాల కథతో తెరకేక్కడంతో కథ గురించి పట్టించుకోకుండా జస్ట్ కామెడీ సీన్స్ కోసం, లైట్ సెంటి మెంట్ సీన్ సీన్స్ కోసం రెగ్యులర్ ఫార్మాట్ లో సాగే కథని బరించాల్సి ఉంటుంది….
అలా కథని బరిస్తే సీన్ వైజ్ కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఆకట్టుకోవడంతో సెకెండ్ ఆఫ్ డీసెంట్ టైం పాస్ మూవీలా అనిపిస్తుంది ధూమ్ ధాం సినిమా…కానీ డిఫెరెంట్ డిఫరెంట్ జానర్ మూవీస్ వస్తున్న ఈ టైంలో ఈ కథ ఈజీగా తేలిపోయేలా అనిపించడం ఖాయం… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్….