Home న్యూస్ OTT లోనే ఈ రికార్డ్ అంటే…థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటేనా!!

OTT లోనే ఈ రికార్డ్ అంటే…థియేటర్స్ లో రిలీజ్ చేసి ఉంటేనా!!

837
0

బాలీవుడ్ యంగ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోట్లాది మంది అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలను వెళ్లి నెలకి పైగా అవుతుంది… తను నటించిన చివరి సినిమా దిల్ బెచారా తనని మళ్ళీ చూడాలి అనుకున్న వాళ్ళ కి ఓ తీపి గుర్తులా మారింది ఇప్పుడు, తను ఎంత మంచి నటుడో సినిమా తో మరో సారి రుజువు అవ్వగా సుశాంత్ సింగ్ రాజ్ ఎప్పటికీ తమ హృదయాలలోనే ఉంటాడు అంటూ…

సినిమా చూసిన ఆడియన్స్ అందరూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ ఒక్క సినిమా ట్రైలర్ నుండి సినిమా రిలీజ్ తర్వాత కూడా ఎన్నో రికార్డులను తిరగరాస్తుండగా ఇవన్నీ సుశాంత్ కి మా తరుపున చేస్తున్న చిన్న నివాళి అని ఫ్యాన్స్ అంటున్నారు…

సినిమా ట్రైలర్ ఇప్పటికే వరల్డ్ లోనే మోస్ట్ లైక్స్ ని అందుకున్న ట్రైలర్ గా వరల్డ్ రికార్డ్ సృష్టించగా సినిమా రిలీజ్ అయిన రోజు 24 గంటల్లో OTT లో రిలీజ్ అయిన ఏ సినిమా సాధించని విధంగా ఏకంగా 75 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని ఓవరాల్ గా దక్కించుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

ఇప్పటి వరకు కూడా ఎ సినిమా కూడా మహా అయితే 10 మిలియన్స్ కి అటూ ఇటూగా వ్యూస్ ని తొలి 24 గంటల్లో సాధించిందని, కానీ దిల్ బెచారా సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసి 75 మిలియన్స్ వ్యూస్ ని దక్కించుకుని చరిత్ర సృష్టించగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్రాఫిక్ ని తట్టుకోలేక క్రాష్ కూడా అయ్యింది.

ఇక సినిమా IMDB లో 9.5 రేటింగ్ తో 68 వేలకి పైగా ఓట్స్ ని సాధించి అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలవడం మరింత విశేషం. సినిమా ప్రస్తుత పరిస్థితుల దృశ్యా ఇలా డైరెక్ట్ రిలీజ్ కే ఈ రేంజ్ రికార్డులను అందుకుంటే…. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మరెలాంటి రికార్డులు అందుకుని ఉండేదో అని అంతా అనుకుంటున్నారు. కోట్లాది మంది అభిమానులు తమకి తోచిన రీతిలో సుశాంత్ ని ఇలా నివాళి ఇస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here