Home న్యూస్ దిల్ రాజు ప్లానింగ్ అలాంటిది…చిన్న లాజిక్ తో 2.4 కోట్ల లాభం!

దిల్ రాజు ప్లానింగ్ అలాంటిది…చిన్న లాజిక్ తో 2.4 కోట్ల లాభం!

722
0

టాలీవుడ్ నిర్మాతలలో దిల్ రాజు స్టైల్ వేరు, సినిమాలను నిర్మించడమే కాకుండా ఆ సినిమా కథ నుండే ఇన్వాల్వ్ అవుతూ తన సూచనలను తెలియజేస్తూ సినిమా అవుట్ పుట్ బాగా రావడానికి తనదైన హెల్ప్ చేస్తాడు, కొన్ని సార్లు ఇది వికటించినా కానీ ఎక్కువ సార్లు మాత్రం దిల్ రాజు ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక నిర్మాతగా కూడా తన సినిమాల ద్వారా మంచి ప్రాఫిట్స్ ని ఎక్కువ సార్లు….

సొంతం చేసుకున్న ఘనత దిల్ రాజు సొంతం చెప్పాలి. రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణం లో భారీ అంచనాలతో తెరకెక్కిన వి ది మూవీ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో నిలవాల్సి ఉన్నా  కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుని నెగటివ్ టాక్ ని సొంతం…

చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రొటీన్ రివేంజ్ స్టొరీ ని సైకో థ్రిల్లర్ గా మార్చి తీశారని దాదాపు అన్ని వెబ్ సైట్స్ కూడా సినిమా కి బిలో యావరేజ్ రేటింగ్ నే ఇచ్చాయి. అలాంటి ఈ సినిమా ని రిలీజ్ కి ముందు మంచి హైప్ తెప్పి అమెజాన్ ప్రైమ్ దగ్గర…

అనుకున్న రేటు కన్నా కూడా ఎక్కువ రేటు సాధించాడు దిల్ రాజు. సినిమా కు ముందు 33 కోట్ల రేటు మాత్రమె ఇస్తామని ప్రైమ్ వాళ్ళు చెప్పగా… దిల్ రాజు అలా అయితే సినిమాను థియేటర్స్ రీ ఓపెన్ చేశాక ఒక 10 రోజులు రిలీజ్ చేసుకుంటాం ఆ రేటు కి మాకు ఓకే.. లేదా అది కూడా వద్దు అంటే…

36 కోట్ల రేంజ్ రేటు ఇవ్వాలని కండీషన్ పెట్టగా… ఫైనల్ గా కొన్ని చర్చల తర్వాత సినిమా రేటు 35.4 కోట్లకు తెగింది… సినిమా రిజల్ట్ ని ముందు ఊహించి ఇలా చెప్పాడో, లేదా ఇలా చేస్తే రేటు పెరుగుతుందని చెప్పాడో కానీ మొత్తం మీద సింపుల్ లాజిక్ తో దిల్ రాజు ఖాతాలో 2.4 కోట్లు అధికంగా వచ్చి పడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here