బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఎట్టకేలకు లాస్ట్ ఇయర్ క మూవీ(Ka Movie) తో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకోగా….ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు….
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ రూబ(Dilruba Movie) ఆడియన్స్ ముందుకు వచ్చే వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా ఆడియో ఆల్ రెడీ మంచి సక్సెస్ గా నిలిచింది…ఇక సినిమా నుండి వచ్చిన డీసెంట్ ప్రమోషనల్..
కంటెంట్ తర్వాత ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా….ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు డీసెంట్ గా పెరిగాయి అని చెప్పాలి. లవ్ స్టోరీ గా తెరకేక్కినా కూడా సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా బాగానే ఉందని ట్రైలర్ లో బాగానే చూపించారు…
కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ కాలేజ్ లో చదువుతున్న హీరోని ఒక అమ్మాయి ఇష్టపడగా తర్వాత హీరో కూడా ఆ అమ్మాయి లవ్ లో పడతాడు…కానీ హీరోకి ఉన్న యాంగర్ ఇష్యూస్ వలన ఎలాంటి అవరోధాలు ఫేస్ చేశాడు….ఆ తర్వాత కథ ఏమయింది అన్నది…
ఓవరాల్ గా మిగిలిన కథ పాయింట్ కాగా, కొంచం ట్రీట్ మెంట్ రిచ్ గానే ఉండటం, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా…..క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మినిమమ్ గ్యారెంటీ అనిపించే రేంజ్ కథతో…
తెరకేక్కుతూ ఉండగా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ వస్తే డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…. ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను ట్రైలర్ పెంచేయగా….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.