Home టోటల్ కలెక్షన్స్ దిల్ రూబ టోటల్ కలెక్షన్స్….40 కోట్ల సినిమా తర్వాత చుక్కలు!!

దిల్ రూబ టోటల్ కలెక్షన్స్….40 కోట్ల సినిమా తర్వాత చుక్కలు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క మూవీ తో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని లాంగ్ రన్ లో అంచనాలను మించి 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో మరోసారి ఆకట్టుకోవాలని…

ట్రై చేసినా కూడా రిలీజ్ అయిన మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో అంచనాలను అయితే అందుకోలేక పోయింది…. మొత్తం మీద 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుని బరిలోకి దిగిన సినిమా…

మొదటి వారంలో 2.4 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా మిగిలిన రన్ లో మరో 45 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది… తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 2.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని రన్ ని పూర్తి చేసుకుంది…మొత్తం మీద 11 కోట్ల బిజినెస్ లో 1.45 కోట్లు మాత్రమే రికవరీ చేసుకున్న సినిమా ….

ఓవరాల్ గా 9.50 కోట్లకు పైగానే లాస్ ను సొంతం చేసుకుని క్వాడ్రపుల్ డిసాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రూబ డీసెంట్ ఔటింగ్ అవుతుంది అనుకున్నా కూడా మళ్ళీ బ్యాక్ టు క మూవీ రోజులకు నెట్టేసింది. దాంతో తన అప్ కమింగ్ మూవీ తో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here