బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ అంచనాలు ఏర్పడగా…
ట్రైలర్ అండ్ సాంగ్స్ పర్వాలేదు అనిపించగా సినిమా ముందుగా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకోగా మొదటి టాక్ కూడా బయటికి వచ్చేసింది….ఆ టాక్ డీసెంట్ గానే ఉందని చెప్పాలి. స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో…
హీరోయిన్ ని చూసి లవ్ లో పడ్డ తర్వాత ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఓపెన్ అవ్వడం ఆసక్తిగా ఓపెన్ అయ్యి హీరో ఇంట్రో తర్వాత లవ్ సీన్స్ తో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపిస్తూ సాగగా యాక్షన్ సీన్స్ ను..బాగా డిసైన్ చేశారు…
సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకోగా..ఫస్టాఫ్ ఓవరాల్ గా యావరేజ్ లెవల్ లో అనిపించగా…సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం పర్వాలేదు అనిపించగా…అక్కడక్కడా సీన్స్ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా సాంగ్స్ ఇక్కడ కూడా మెప్పించడం…యాక్షన్ పార్ట్ బాగుండటంతో…
పర్వాలేదు అనిపించేలా సెకెండ్ ఆఫ్ ఉండగా…మొత్తం మీద ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగడం ఖాయమని చెప్పాలి. కిరణ్ అబ్బవరం యాక్షన్ సీన్స్ లో కుమ్మేయగా ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదు అనిపించాడు. సినిమా చాలా వరకు విజువల్స్ రిచ్ గా అనిపించగా…
కథ పాయింట్ కొంచం రొటీన్ గా అనిపించినా కూడా ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉండటంతో మరీ ఎక్కువగా బోర్ అయితే అనిపించలేదు…. మొత్తం మీద ఫస్టాఫ్ యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ యావరేజ్ గా అనిపించగా ఓవరాల్ గా సినిమా యావరేజ్ కి అటూ ఇటూలా అనిపించింది…
ఓవరాల్ గా ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకి పర్వాలేదు అనిపించే రిపోర్ట్స్ ఉండగా…రెగ్యులర్ షోలకు టాక్ కొంచం బెటర్ గా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరు చూపించే అవకాశం ఉంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవుతుందో చూడాలి.