బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క మూవీ రిలీజ్ కి ముందు వరకు వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ కంబ్యాక్ ను దక్కించుకుని కుమ్మేశాడు…ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో…
వచ్చిన కిరణ్ అబ్బవరం తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
500 వరకు థియేటర్స్ కి రిలీజ్ కాబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 750వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందుగానే ఓపెన్ అవ్వగా మరీ క మూవీ రేంజ్ లో కాక పోయినా కూడా…
ఉన్నంతలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాలతో కంపేర్ చేసే రేంజ్ కి అటూ ఇటూగా బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా…. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…
సినిమా మొదటి రోజు 80 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమాకి టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటే 1 కోటి నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక….