రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ తో వచ్చిన సినిమా డర్టీ హరి… ఒకప్పుడు నిర్మాతగా బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ఎం ఎస్ రాజు గారు డైరెక్టర్ గా మారి అప్పట్లో వాన సినిమా తీసి నిరాశ పరచగా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తూనీగా తూనీగా సినిమా తీయగా ఆ సినిమా కూడా మెప్పించలేదు, ఇక ఆ సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని చేసిన సినిమా డర్టీ హరి.. యూత్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా…
యూత్ ని మెప్పించి మంచి వ్యూస్ తో దూసుకు పోతూ ఉండగా మరో పక్క సినిమా ఒరిజినల్ కథలా సినిమా యూనిట్ ఊదరగొట్టేశారు, క్లైమాక్స్ అసలు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది అని, కథ పాయింట్ కూడా ఇప్పటి వరకు రాని విధంగా ఉంటుంది అంటూ గట్టిగానే హంగామా చేశారు….
తీరా సినిమా చూస్తె హాలీవుడ్ మూవీస్ ని ఇన్ స్పైర్ గా తీసుకుని సినిమా తీశారేమో అనిపించగా రెండు రోజులు గడవక ముందే ఇది ఇన్ స్పైర్ గా తీసుకుని కాదు ఫ్రీ మేక్ గా చేసిన సినిమా అని తెలిసి పోయింది… హాలివుడ్ లో 2005 లో స్కార్లెట్ జాన్సన్ ముఖ్య పాత్రలో వచ్చిన…
మ్యాచ్ పాయింట్ మూవీ ని తెలుగు లో ఇప్పుడు అనఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు… కాన్సెప్ట్ అండ్ స్టొరీ, సీన్ బై సీన్ ఆ సినిమా లో ఉన్నట్లు గానే ఈ సినిమాలో ఉంటుంది, కానీ బ్యాగ్ డ్రాప్ మాత్రం మనకు సూట్ అయ్యే విధంగా మ్యాచ్ చేశారు. అదేదో డైరెక్ట్ గా అఫీషియల్ రీమేక్ అని చెప్పేస్తే అయిపోయేది కానీ అలా చేస్తే పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన…
ఈ సినిమా కి ఎఫెక్ట్ ఉంటుంది అని జాగ్రత్త పడ్డారు, అది సినిమా కి బాగానే కలిసి వచ్చి మొదటి రోజు సాలిడ్ వ్యూస్ అండ్ గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి. ఇక వీకెండ్ లెక్కలు తేలాల్సి ఉండగా సినిమా ఈ పాటికే సేఫ్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు. అన్ అఫీషియల్ రీమేక్ తో రాజు గారి మంచి ప్రాఫిట్స్ నే ఇప్పుడు సొంతం చేసుకోబోతున్నారు అని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు.