ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం ఇలా అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేసిన ఎం ఎస్ రాజు డైరెక్టర్ గా మారి తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోక పోవడం తో కొంత గ్యాప్ తీసుకుని బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా డర్టీ హరి… రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు డిజిటల్ రిలీజ్ గా వచ్చిన ఈ సినిమా వ్యూస్ పరంగా సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
ముందు పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయ్యి మంచి లాభాలను దక్కించుకున్న తర్వాత సినిమాను ఆహా యాప్ వాళ్లకి సాలిడ్ రేటు కి అమ్మారు. అక్కడ కూడా మంచి వ్యూస్ ని సొంతం చేసుకున్న తర్వాత ను వెంటనే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రిలీజ్ చేశారు.
సినిమా సంక్రాంతి సినిమాలు పరుగు మొదలు పెట్టె టైం లో ఉన్న థియేటర్స్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకోగా ఉన్న తక్కువ టైం లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని షార్ట్ టైం పరుగును కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
సినిమా కి క్రాక్ రిలీజ్ రోజున థియేటర్స్ లో రిలీజ్ ను సరిగ్గా సొంతం చేసుకోకపోవడం కలిసి వచ్చి ఆ ఒక్క రోజే 8 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసింది. టోటల్ గ్రాస్ 26 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. సినిమాను ఎలాంటి బిజినెస్ లేకుండా….
పెర్సెంటేజ్ బేస్ తో రిలీజ్ చేశారు. వచ్చిన కలెక్షన్స్ ఇటు నిర్మాతలు అటు థియేటర్ ఓనర్లు పంచుకుంటారు. దాంతో ఎలాంటి నష్టాలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని పరుగును ముగించుకుంది ఈ సినిమా. పే పెర్ వ్యూ, డిజిటల్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన సినిమాల్లో ఒకటిగా చేరింది.