Home న్యూస్ డర్టీ హరి రివ్యూ….రకరకాలుగా ఉంది బాస్!

డర్టీ హరి రివ్యూ….రకరకాలుగా ఉంది బాస్!

0

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో ఈయన సినిమా అంటే మినిమమ్ ఉంటుంది అనే నమ్మకం సొంతం చేసుకున్న తర్వాత డైరెక్టర్ గా మారి వాన, తూనీగా తూనీగా లాంటి నిరాశ పరిచే సినిమాలను తెరకెక్కించిన ఎం ఎస్ రాజు తర్వాత భారీ గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ డర్టీ హరి… టీసర్ ట్రైలర్ లతోనే యూత్ లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది…

యూత్ నే టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా రాజు గారి మాటల్లో మట్టుకు ఒక పాటకే పరిమితం కథ మీరు ఊహించని విధంగా ఉంటుంది అంటూ చెప్పడంతో మరింత ఆసక్తి పెంచిన ఈ సినిమా లో అంతలా ఉన్న కథ ఏంటి, సినిమా ఎంతవరకు యూత్ ని ఆకట్టుకుంది, కథగా మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ….

కథ పాయింట్ కి వస్తే రాష్ట్ర స్థాయిగా చెస్ లో పతకాలు గెలిచిన హీరో హైదరాబాదులో ఒక క్లబ్ లో చెస్ కోచ్ గా చేరుతాడు, అనుకోకుండా ఓ బిగ్ షాట్ తో పరిచయం తో హీరోయిన్ సుహానీ శర్మతో పరిచయం ఏర్పడి తర్వాత లవ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరుగుతుంది…

తర్వాత అనుకోకుండా సిమ్రత్ కౌర్ తో పరిచయం ఏర్పడగా ఇద్దరూ దగ్గరవుతారు… తర్వాత ఏం జరిగింది, ఈ ఇల్లీగల్ ఎఫైర్ వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి లాంటి విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా సినిమాలో ఉన్నవి చాలా తక్కువ క్యారక్టర్స్ అయినా కానీ…

అందరూ బానే చేశారు.. హీరో ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా ఇవ్వలేదు కానీ ఆ రోల్ కి తను సెట్ అయ్యాడు అనిపిస్తుంది, సుహానీ శర్మ రోల్ చిన్నదే అయినా క్లైమాక్స్ లో తన మార్క్ కొంచం చూపించి మెప్పించాగా సినిమా మొత్తం మీద సిమ్రత్ కౌర్ యూత్ కి ఫుల్ కిక్ ఇచ్చే సన్నివేశాలతో ఎలాంటి బెరుకు లేకుండా నటించి…

ఆ విషయం లో మెప్పించింది… నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు కానీ స్కిన్ షో పరంగా హద్దులు దాటిపోయింది… ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో తమ చిన్న రోల్స్ లో పర్వాలేదు అనిపించుకున్నారు. సినిమాలో ఒక్క సాంగ్ మాత్రమే ఉండగా ఆ సాంగ్ ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది….

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రొటీన్ గా అనిపిస్తుంది, తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది యిట్టె చెప్పగలం, డైలాగ్స్ బాగున్నాయి… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ఎం ఎస్ రాజు గారి కథ మైండ్ బ్లాంక్ చేస్తుంది, ట్విస్ట్ మరో రేంజ్ లో ఉంటుంది అంటూ హైప్ పెంచినా కానీ…

హాలీవుడ్ అన్ ఫెత్ ఫుల్ నుండి కథ పాయింట్ ని తీసుకుని బాలీవుడ్ ఇల్లీగల్ ఎఫైర్ మూవీస్ నుండి కొన్ని పాయింట్స్ ని తీసుకుని ఈ కథని అల్లుకున్నారని అనిపిస్తుంది. కథ పరంగా ఏమి ఇంపాక్ట్ లేని కథని యూత్ ని టార్గెట్ చేసి తీసిన సీన్స్ తో ప్రజెంట్ చేసి క్లైమాక్స్ లో ఓ ఊహించే ట్విస్ట్ పెట్టి రొటీన్ గా ముగించారు అనిపిస్తుంది…

ఇక్కడ రెండు రకాలుగా సినిమాను చూడొచ్చు, యూత్ పరంగా ఆలోచించి చూస్తె వాళ్లకి కావాల్సిన అంశాలు అన్నీ పెట్టి మెప్పించారు, డిఫెరెంట్ మూవీ అన్న పాయింట్ ఆఫ్ ఫ్యూ నుండి చూస్తె క్లైమాక్స్ లో వచ్చి చిన్న ట్విస్ట్ తప్ప పెద్దగా ఏమి లేదు అనిపిస్తుంది… అండ్ హాలీవుడ్ బాలీవుడ్ నుండి ఇప్పటికే అనేక సార్లు వాడిన…

ఇల్లీగల్ ఎఫైర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ కాబట్టి యావరేజ్ గా అనిపిస్తుంది డర్టీ హరి… ఓవరాల్ గా యూత్ ని చాలా వరకు మెప్పించే అంశాలు ఉన్న డర్టీ హరి వాళ్ళని మెప్పించే అవకాశం ఉంది, కానీ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తె జస్ట్ ఓకే అనిపించే సినిమా గా చెప్పుకోవచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here