దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ షాదీ ముబారక్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే, టాక్ పర్వాలేదు ఈజీగా ఒకసారి చూసే విధంగా సినిమా ఉందీ అంటూ వచ్చినా కానీ ఆడియన్స్ ఎందుకో ఈ సినిమాను చూడటానికి ఇష్టపడలేదు, దాంతో సినిమా సాధించిన బిజినెస్ లో భారీ నష్టాలను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ పరుగును చాలా త్వరగా ముగించింది.
బిజినెస్ మొత్తం మీద 2.55 కోట్లు కాగా సినిమా 15 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా పరుగును ముగించింది, దాంతో నష్టం మొత్తం మీద 2.4 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని దిమ్మతిరిగే డిసాస్టర్ గా నిలిచింది.
కానీ అదే టైం లో సినిమా చూసిన వాళ్ళు యూసర్ రేటింగ్ లు ఇచ్చే IMDB లో సినిమాకి వచ్చిన యావరేజ్ రేటింగ్ ఓ రేంజ్ లో ఉండటం విశేషం, నిన్నటి వరకు ఏకంగా 10 కి 9.1 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ 8.8 రేటింగ్ యూసర్ రేటింగ్ ను సొంతం చేసుకుంది.
ఒక చిన్న సినిమాకి ఇంతకంటే మౌత్ టాక్ మరోటి ఉండదని చెప్పొచ్చు, చూసిన వాళ్ళు తక్కువ మందే ఉన్నా వాళ్ళలో యూసర్ రేటింగ్ ఇంతలా రావడం అంటే విశేషమే, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక డిజిటల్ రిలీజ్ అయ్యాక సినిమా చూసి మళ్ళీ ప్రశంసలు సొంతం చేసుకునే అవకాశం…
ఎంతైనా ఉందని చెప్పాలి… బాక్స్ ఆఫీస్ దగ్గర రాంగ్ టైం లో సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పొచ్చు, అదే టైం లో యూనిక్ట్ కనీస ప్రమోషన్స్ ని చేసి ఉన్నా సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది, కానీ అలా జరగగ పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయిన సినిమా ఇలా IMDB యూసర్ రివ్యూస్ లో సూపర్ డూపర్ హిట్ అయింది..